మరో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం విక్రమ్ వేద రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా లో పవర్ ఫుల్ యాక్షన్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమా పై ఆసక్తి కలిగిస్తుంది.
ఈ చిత్రం తమిళ్ సూపర్ హిట్ సినిమా కు ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తారీఖున విక్రమ్ వేద హిందీ వర్షన్ విడుదల కాబోతుంది. ఈ సమయంలోనే ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ మరో సినిమా విడుదల తేదిని ప్రకటించడం ద్వారా వార్తల్లో నిలిచాడు.
విక్రమ్ వేదా కాకుండా ఫైటర్ అనే ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని హృతిక్ రోషన్ చేస్తున్నాడు. బాలీవుడ్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే సినిమా కార్యక్రమాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని హీరో హృతిక్ రోషన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సెప్టెంబర్ 28 2023 తారీఖున ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు గా అధికారికంగా ప్రకటించారు.
విక్రమ్ వేద విడుదలైన సరిగ్గా ఏడాదికి ఫైటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా హృతిక్ రోషన్ అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ బాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ రోషన్ ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు. క్రిష్ వంటి అద్బుతమైన సినిమాల్లో నటించిన హృతిక్ రోషన్ సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఇలాంటి సినిమాల్లో నటించాల్సి వస్తుంది.
కమర్షియల్ సక్సెస్ కోసం చాలా గ్యాప్ తీసుకుని పలు కథలు విన్న తర్వాత హృతిక్ రోషన్ ఈ రెండు సినిమాలు కమిట్ అయ్యాడు అనేది టాక్. అందుకే కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో హృతిక్ రోషన్ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. ఫైటర్ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పటికే షారుక్ ఖాన్ తో పఠాన్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పఠాన్ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా హృతిక్ రోషన్ తో ఈయన చేస్తున్న ఫైటర్ సినిమా కు భారీ హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని.. తద్వారా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బజ్ ను క్రియేట్ చేస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ దర్శకుడు కమర్షియల్ గా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ దక్కించుకున్నాడు కనుక పఠాన్ మరియు ఫైటర్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయని అంటున్నారు.