AMB సినిమాస్ గ్రీన్ సిటీలోనే ఎందుకు?

Update: 2020-02-05 16:30 GMT
హైద‌రాబాద్ గ‌చ్చిబౌళిలో ఏఎంబీ సినిమాస్ గ్రాండ్ స‌క్సెస్ నేప‌థ్యంలో శ‌ర‌వేగంగా త‌దుప‌రి వెంచ‌ర్ కి ప్రణాళిక‌ల్ని సిద్ధం చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందుకోసం సూప‌ర్ స్టార్ మ‌హేష్ - న‌మ్ర‌త జంట ఇప్పటికే ఏషియ‌న్ సినిమాస్ భాగ‌స్వామ్యంలో ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ అల‌యెన్స్ లో ఇటు హైద‌రాబాద్ అటు బెంగ‌ళూరు స‌హా ఏపీలోనూ ప‌లు చోట్ల‌ మాల్స్ కం థియేట‌ర్ల‌ను నిర్మించ‌నున్నార‌ని తెలుస్తోంది. అందుకోసం వంద‌ల కోట్ల పెట్టుబ‌డుల్ని జాయింట్ వెంచ‌ర్ రూపంలో వెద‌జ‌ల్ల‌నున్నారు.

బెంగ‌ళూరు ఏఎంబీ గురించి గ‌త కొంత‌కాలంగా తామ‌ర తంప‌ర‌గా స‌మాచారం లీక‌వుతూనే ఉంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. న‌మ్ర‌త మ‌హేష్ ఇప్ప‌టికే బెంగ‌ళూరు ఏఎంబీ ప‌నుల్ని ప్రారంభించార‌ట‌. హైద‌రాబాద్ ఏఎంబీ మాల్ కి అన్నీ తానే అయ్యి వ్య‌వ‌హ‌రించిన న‌మ్ర‌త బెంగ‌ళూరులోనూ ఇంత‌కుమించిన నిర్మాణం చేప‌ట్టేందుకు శ్ర‌ద్ధ తీసుకుంటున్నార‌ట‌. ఇంటీరియ‌ర్ డిజైన్ స‌హా లుక్ విష‌యంలో శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. ఆ మేర‌కు ప్ర‌ముఖ ఆర్కిటెక్చ‌ర్ల‌ ను సంప్రదించార‌ని తెలుస్తోంది. గ్రీన్ సిటీ బెంగ‌ళూరు లో సాఫ్ట్ వేర్ హ‌బ్ ఉన్న పోష్ ఏరియాలోనే ఏఎంబీ మాల్ ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

హైద‌రాబాద్ గ‌చ్చిబౌళి త‌ర‌హాలోనే మ‌రో పోష్ ఏరియాలో ఏఎంబీ మాల్ నిర్మించే ఆలోచ‌న ఉంద‌ని ఇదివ‌ర‌కూ వెల్ల‌డైంది. ఇక తెలంగాణ‌లో ప‌లు న‌గ‌రాలు స‌హా.. ఏపీలోనూ విశాఖ రాజ‌ధానిలోనూ ఏఎంబీ ని విస్త‌రించే ప్లాన్ ఉంద‌ట‌. విజ‌య‌వాడ- తిరుప‌తి స‌హా ప‌లు న‌గ‌రాల్లో ఏఎంబీ మాల్స్ ని విస్త‌రించే ఆలోచ‌న ప్రాథ‌మిక ద‌శ‌లో ఉంద‌ని తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న న‌గ‌రాల్లో భారీగా స్థ‌లాల్ని కొనుగోలు చేయ‌డం అక్క‌డ మాల్ నిర్మాణానికి సానుకూల‌త‌ల్ని వెత‌క‌డం అటుపై నిర్మాణాలు చేప‌ట్ట‌డం ఇదీ ప్ర‌ణాళిక‌. ఇందుకోసం భారీగా పెట్టుబ‌డుల్ని స‌మీక‌రించ‌నున్నారు. ఏషియ‌న్ సినిమాస్ భాగ‌స్వామ్యం లో మ‌హేష్ - న‌మ్ర‌త బృందం ఈ ప్ర‌ణాళిక‌ల్ని విస్త‌రిస్తుండ‌డం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News