ఫొటోటాక్ : చాలా కాలం తర్వాత మేకప్ తో మహేష్
కరోనా కారణంగా గత ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న స్టార్స్ సూపర్ స్టార్స్ మెల్లగా షూటింగ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. కరోనా ఇంకా ఉన్నా కూడా తప్పని పరిస్థితుల్లో సినిమా షూటింగ్ కు ముందడుగు వేస్తున్నారు. ఈ నెలలో చాలా మంది స్టార్స్ షూటింగ్స్ కు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది మొదటి నుండి కూడా షూటింగ్స్ కు దూరంగా ఉన్న మహేష్ బాబు ఎట్టకేలకు ఒక యాడ్ షూట్ కోసం రెడీ అయ్యాడు.
ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆధ్వర్యంలో మహేష్ బాబు యాడ్ కోసం ఫొటో షూట్ చేశాడు. చాలా నెలల తర్వాత మేకప్ తో కనిపించిన మహేష్ బాబు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. లైట్ గా గడ్డం మీసాలు కాస్త డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఒక సింపుల్ లుకింగ్ టీషర్ట్ లో మహేష్ బాబు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే లుక్ తో సర్కారు వారి పాట చిత్రంలో కూడా మహేష్ బాబు కనిపించే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది చివరి నుండి సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.