జూన్ 3న వస్తున్న సూపర్ స్టార్

Update: 2016-05-25 05:13 GMT
టాలీవుడ్ కి అసలు సిసలైన సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. ఏడాదికి 20 చొప్పున కూడా సినిమాలు రిలీజ్ చేసి ఇండస్ట్రీలో అత్యధికంగా కష్టపడే హీరోగా, మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారాయాన. గత కొంతకాలంగా వయసు సహకరించకపోవడంతో.. ఎక్కువగా సినిమాలను చేయడం లేదు. కానీ 'శ్రీశ్రీ' అనే స్క్రిప్ట్ మాత్రం విపరీతంగా నచ్చడంతో.. మూడేళ్ల తర్వాత సుకుమారుడు అనంతరం మళ్లీ తెరపై కనిపించనున్నారు కృష్ణ.

శ్రీశ్రీ ఇప్పటికే షూటింగ్ - పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్నీ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది. అయితే కొన్ని నెలలుగా టాలీవుడ్ లో చిన్న సినిమాల రిలీజ్ సరైన సమయం దొరకడం లేదన్న మాట వాస్తవమే. అందుకే విడుదల ఆలస్యం కాగా.. ఇప్పుడీ శ్రీశ్రీని జూన్ 3న థియేటర్లలోకి తెస్తున్నారు. ఓ మరాఠీ చిత్రానికి రీమేక్ రూపొందిన ఈ రివెంజ్ డ్రామా.. ఆద్యంతం ఆకట్టుకుంటుందని దర్శకుడు ముప్పలనేని శివ అంటున్నాడు.

శ్రీశ్రీలో కృష్ణ భార్య విజయనిర్మల కూడా నటించగా.. ఆమె కుమారుడు నరేష్ పోలీస్ గా ఓ ప్రధాన పాత్ర పోషించాడు. యంగ్ హీరో సుధీర్ బాబు ఓ కేమియో చేశాడు. ఇక లేటెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీశ్రీ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. రీమేక్ ల విషయంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ముప్పలనేని శివ.. శ్రీశ్రీని సూపర్బ్ గా తెరకెక్కించాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
Tags:    

Similar News