సన్నీకి ఊపిరాడనిస్తారా?

Update: 2017-11-21 13:30 GMT
సినిమాల్లో సన్నీ లియెన్ కనిపిస్తే ఆమె అందం గురించి ఎవరైనా ఈజీగా చెప్పగలరు. కానీ ఆమె అభిమానుల గురించి చెప్పడం చాలా కష్టమే సుమీ. ఎందుకంటే కేరళలో రెండు నెలల క్రితం సన్నీ కోసం అక్కడి మగవారు ఏ స్థాయిలో ఎగబడ్డారో తెలిసిందే. ఇసుక వేస్తే రాలనంత జనం. సన్నీ క్రేజ్ ఏంటో ఆ ఒక్క సీన్ తో తెలిసిపోయింది. వారిని చూసి సన్నీనే చాలా ఆశ్చర్యపోయింది.

ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు కూడా ఆమె అభిమానులపై ఏ విధంగా కామెంట్స్ చేశాడో అందరికి తెలిసిందే. ఆమె అందానికి దాసోహం అయిన వారిలో తాను కూడా ఒకడినని చెప్పాడు. ఇక ఇప్పుడు సన్నీ తమిళనాడులో కూడా అడుగుపెట్టబోతోందట. అసలే తమిళ జనాలకు సినిమాల పిచ్చి. సాధారణం సెలబ్రెటీలు వస్తేనే ఎగబడతారు. ఇక సన్నీ లియోన్ వస్తోందంటే ఏమైనా ఉందా.. ఆమెకు ఊపిరి కూడా ఆడనివ్వరేమో..    

ఈవీపీ ఫిలిం సిటీలో వచ్చే నెల డిసెంబర్ 3న జరగబోయే మ్యూజిక్ ఈవెంట్ లో సన్నీ లియోన్ పాల్గొననుంది. అయితే సన్నీ  ఆ మధ్య కోలీవుడ్ లో జై నటించిన ‘వడకరి’ అనే సినిమాలో కనిపించి స్పెషల్ సాంగ్ లో తమిళ కుర్రకారును తెగ ఆకర్షించింది. ఇక ఈసారి లైవ్ లో అమ్మడు కనిపించబోతుండడంతో ఈవెంట్ నిర్వాహకులు స్పెషల్ గా ఏర్పాట్లను చేస్తున్నారు.
Tags:    

Similar News