కొత్త కమెడియన్లకి త్రివిక్రమ్ దొరకాలిగా

Update: 2016-02-14 05:24 GMT
కమెడియన్ నుంచి హీరోగా మారిపోయాడు సునీల్. ఈ మధ్య గ్యాప్ వచ్చింది కానీ.. చేతిలో ఛాన్సులు మాత్రం బాగానే ఉన్నాయి. అయితే.. సునీల్ కామెడీ వేషాలు వేయడం మానేశాక.. ఇండస్ట్రీలోను - ఆడియన్స్ లోను ఓ ఫీలింగ్ ఉంది. సునీల్ ప్లేస్ ని ఇంకా ఏ కమెడియన్ ఫిల్ చేయలేకపోతున్నాడని అంటున్నారు. మరి దీనికి సునీల్ ఏమంటున్నాడో తెలుసా?

సునీల్ లాంటి వాళ్లు వంద మందొస్తారని.. సునీల్ స్వయంగానే చెప్పాడు. ఇప్పుడు వస్తున్న కొత్తవాళ్లంతా బ్రహ్మాండంగా చేస్తున్నారని.. అయితే వాళ్లకు లేనిది. తనకు మాత్రమే దక్కిన అదృష్టం త్రివిక్రమ్ తో స్నేహం అంటున్నాడు సునీల్. 'కొత్త కమెడియన్స్ అందరికీ త్రివిక్రమ్ లాంటి వాళ్లు దొరకాలి. అలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. నా బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు పాత్రలు సృష్టించాడు. నాకంటూ డైలాగ్ డెలివరీ ఇచ్చాడు'అంటూ మాటల మాంత్రికుడి పట్ల కృతజ్ఞత చాటుకున్నాడు కామెడీ హీరో. అంతే కాదు.. వంద చేపలు ఇవ్వడం కంటే ఒక చేప పట్టడం నేర్పు. అన్న త్రివిక్రమ్ మాటను ఎప్పటికీ మర్చిపోలేడట.

ఇప్పుడీ హీరో నటించిన కృష్ణాష్టమి రిలీజ్ కు రెడీ అయింది. త్రివిక్రమ్ కూడా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఇద్దరూ ఖరీదైన కార్లలో తిరుగుతున్నా.. అప్పట్లో ఇద్దరూ కలిసి డొక్కు స్కూటర్ పై తిరిగినప్పటి సంతృప్తి మాత్రం దొరకడం లేదట సునీల్ కి.
Tags:    

Similar News