సునీల్ సినిమా.. అంతలా ముంచిందా?

Update: 2016-10-17 17:30 GMT
‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని చాలా ఆశపడ్డాడు సునీల్. వీరూ పోట్ల ఇంతకుముందు తీసిన మూడు సినిమాలూ కమర్షియల్ గా మంచి ఫలితాల్నే సాధించాయి. పెద్ద హిట్లు కాకపోయినా.. నష్టాలైతే తేలేదు. ఓ మోస్తరుగా లాభాలే మిగిల్చాయి. దీంతో సునీల్ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ ‘ఈడు గోల్డ్ ఎహే’ మంచి ఫలితమే సాధిస్తుందని భావించారు. కానీ వీరూ అంచనాల్ని అందుకోలేకపోయాడు. అతను కూడా సునీల్ గత సినిమాలకు ఏమాత్రం తీసిపోని చిత్రాన్నే అందించాడు. అందులోనూ దసరాకు విపరీతమైన పోటీ మధ్య రావడం ‘ఈడు గోల్డ్ ఎహే’కు ప్రతికూలంగా మారింది.

ఈ సినిమాతో నిర్మాత రామబ్రహ్మం సుంకర భారీ నష్టాలే మూటగట్టుకున్నట్లు సమాచారం. ఆ మొత్తం దాదాపు రూ.10 కోట్లని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రూ.15 కోట్లు దాటిందంట. ఐతే ‘ఈడు గోల్డ్ ఎహే’ కనీసం ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలోనూ విఫలమైంది. సునీల్ గత సినిమా ‘జక్కన్న’ ఈ విషయంలో చాలా బెటర్. ఆ సినిమాకు టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. బడ్జెట్ చాలా వరకు ఓపెనింగ్స్ తోనే రికవర్ అయిపోయింది. స్వల్ప నష్టాలతో బయటపడ్డాడు నిర్మాత. కానీ ‘ఈడు గోల్డ్ ఎహే’ పరిస్థితి వేరు. దసరా పోటీ మధ్య ఈ చిత్రాన్ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. బి.. సి సెంటర్లలో పరిస్థితి కొంచెం మెరుగే కానీ.. ఎ సెంటర్లలో అస్సలు ఆదరణకు నోచుకోలేదు. దీంతో నిర్మాతకు భారీ నష్టాలు తప్పలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News