సిక్స్ ప్యాక్ సునీల్.. గోల్డ్ అంట

Update: 2015-12-16 15:32 GMT
కమెడియన్ నుంచి హీరోగా టర్నింగ్ ఇచ్చుకున్నాక.. రీసెంట్ గా సునీల్ కాస్త స్లో అయ్యాడు. ఇప్పుడు వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ మళ్లీ బిజీ అయిపోతున్నాడు. ప్రస్తుతం సునీల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అన్నిటినీ ఒకేసారి షూటింగ్ చేసేస్తుండడం విశేషం.

వాసు వర్మ తీస్తున్న కృష్ణాష్టమితోపాటు, వంశీకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు సునీల్. ఈ రెండింటితో పాటు.. ఇప్పుడు "ఈడు గోల్డ్ ఎహే" అంటూ ఓ సినిమా మొదలుపెట్టేశాడు. రగడ - బిందాస్ డైరెక్టర్ వీరు పోట్ల దర్శకత్వంలో సునీల్ కొత్త సినిమా తెరకెక్కనుంది. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టెయినర్ గా ఈ మూవీ ఉండనుంని తెలుస్తోంది. "ఈడు గోల్డ్ ఎహే" టైటిల్ తో ఆసక్తి కలిగించిన సునీల్.. ఫస్ట్ లుక్ తో మరింతగా ఆశ్చర్యపరిచాడు. నవ్వుతున్న తన ఫోటో మాస్క్ ని చేత్తో పట్టుకున్న సీరియస్ సునీల్ గెటప్.. భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మాస్ హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఉన్న సునీల్ గెటప్ అదుర్స్ అనేలా ఉంది.

ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ సహా.. మిగిలిన నటీనటుల వివరాలను ప్రకటించాల్సి ఉంది. అయితే. ఇప్పటికే సెలక్షన్ పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్ని డీటైల్స్ ను ప్రకటించనున్నారు మేకర్స్. ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కునున్న ఈడు గోల్డ్ ఎహే మూవీకి.. అనిల్ సుంకర ప్రొడ్యూసర్.

Tags:    

Similar News