జడ్.. ఈ టైటిలేంటి సందీప్?

Update: 2017-04-26 09:40 GMT
తెలుగులో వరుస ఫెయిల్యూర్లతో బాగా వెనుకబడిపోయాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. గత ఏడాది రన్.. ఒక్క అమ్మాయి తప్ప సినిమాలు అతడికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ ఏడాది ‘నగరం’ అనే తమిళ డబ్బింగ్ సినిమాతో పలకరించాడు సందీప్. సినిమాలో కంటెంట్ ఉన్నప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ.. సినిమా అయితే నిలబడలేకపోయింది. తెలుగులో ఇప్పుడతడి ఆశలన్నీ ‘నక్షత్రం’ మీదే ఉన్నాయి. ఐతే ఈ సినిమా రిలీజ్ విషయంలో కష్టాలు ఎదుర్కొంటోంది. మేలో ఈ చిత్రం రిలీజవుతుందని అంటున్నారు కానీ.. పక్కా అని చెప్పలేం. ఈ లోపు మరో తమిళ డబ్బింగ్ మూవీతో సందీప్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించే అవకాశాలున్నాయి.

నిర్మాతగా మంచి టేస్టున్న సినిమాలు తీసిన సి.వి.కుమార్ దర్శకుడిగా మారుతూ.. సందీప్ హీరోగా ‘మాయవన్’ అనే సినిమాను తెరకెక్కించాడు. పోయినేడాదే దీని టీజర్ రిలీజైంది. అందరినీ ఆకట్టుకుంది. ఇందులో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించడం విశేషం. ఈ చిత్రాన్ని ‘జడ్’ పేరుతో తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. ఎస్కే బషీద్ ‘జడ్’ణు తెలుగులో అందిస్తున్నాడు. ఆల్రెడీ తెలుగు టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఐతే తమిళంలో ‘మాయవన్’ అనే టైటిల్ పెట్టినపుడు.. తెలుగులో దానికి సమానార్థకమైన ‘మాయగాడు’ అనో ఇంకో టైటిలో పెట్టుకోవచ్చు. తెలుగులో పెట్టుకోవడానికి టైటిళ్లకు కొదవేమీ లేదు. మరి ‘జడ్’ అనే ఇంగ్లిష్ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో? కనీసం అదేమైనా అంత ఆకర్షణీయంగా.. క్యాచీగా ఉందా అంటే అదీ లేదు. మరి ఏరికోరి ఈ టైటిలే పెట్టడంలో ఆంతర్యమేంటో మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News