• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నవదీప్ చేతుల మీదుగా...

నవదీప్ చేతుల మీదుగా విడుదలైన 'సండే స్పెషల్' ఫస్ట్ లుక్..!

By - Tupaki Desk
Update: 2021-07-02 02:30 GMT
నేటితరం దర్శక రచయితలు ప్రేక్షకులకు విభిన్నమైన కథలను చెప్పడానికి కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్నారు. ఆడియన్స్ కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలు చూపించకుండా.. కంటెంట్ బాగున్న ప్రతీ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో అనేక చిన్న సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలో కొందరు యంగ్ స్టర్స్ కలసి ''సండే స్పెషల్'' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.

యువ హీరో నవదీప్ ఈరోజు గురువారం ''సండే స్పెషల్'' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ తెలియజేసారు. 'ప్రతి కథ వెనుక ఒక కథ ఉంటుంది' అనే కాన్సెప్ట్ ఈ సినిమా రూపొందుతోంది. దీనికి అనూప్ చక్రవర్తి బాజినేని దర్శకత్వం వహిస్తున్నాడు. రేయాన్ష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 'పిట్టకథ' సినిమాతో మెప్పించిన నిత్యా శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా విడుదలైన ''సండే స్పెషల్'' ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరోయిన్ నిత్యా శెట్టి నోటికి ప్లాస్టర్ వేయబడి ఒక చైర్ కు తాళ్లతో బంధించబడి ఉంది. పక్కనే మరో కుర్చీపై కూర్చొని ఉన్న రేయాన్ష్ చేతిలో పెన్నూ పేపర్ పట్టుకొని ఏదో రాయడానికి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. మ్యాన్ కైండ్ మూవీస్ బ్యానర్ పై రామకృష్ణ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    
  • Sunday Special 
  • First Look 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS