తాతకు కోపం తెప్పించిన సుమంత్
నటసింహా నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో కథానాయకుడు - మహానాయకుడు చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితాన్ని రెండుగా విభజించి కమర్షియల్ అంశాల కలయికతో క్రిష్ ఈ చిత్రాన్ని మహదాద్భుతంగా తెరకెకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు భాగాల్లో ఏఎన్నార్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తాజాగా సుమంత్ చెప్పిన దానిని బట్టి అర్థమవుతోంది. కథానాయకుడిగా - మహానాయకుడిగా ఆయన జీవితంలో ఏఎన్నార్ ఉన్నారు. అదే విషయాన్ని తెరపై చూపిస్తున్నారట.
మీరు ఎన్టీఆర్ పై తెరకెక్కుతున్న ఆ రెండు భాగాల్లో కనిపిస్తారా? అన్న ప్రశ్నకు .. అవుననే సుమంత్ చెప్పారు. కథానాయకుడు - మహా నాయకుడు రెండిటిలోనూ కనిపిస్తానని, క్రిష్ నుంచి తనకు ఆశీస్సులు లభించాయని అన్నారు. క్రిష్ నా ఫేవరెట్ డైరెక్టర్. అతడి నుంచి నాకు కెరీర్ పరంగానూ పూర్తి అండదండలున్నాయి.. అని సుమంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాత ఏఎన్నార్ గా నటించడం ఒత్తిడి అని భావించారా? అంటే.. అదేం లేదని అన్నారు. తాతగా నటించడం నా అదృష్టం. అలా నటించడాన్ని ఒత్తిడి అని అనుకోలేదు. బాధ్యతగా తీసుకున్నాను. అందుకోసం తాత నటించిన ఎన్నో సినిమాలు చూశాను. ఇంటర్వ్యూలు పరిశీలించాను. ఈ ఇంటర్వ్యూలతో చాలా తెలుసుకోగలిగాను. అందుకు జర్నలిస్టులకు కృతజ్ఞతలు. బాలకృష్ణ గారితో పని చేయడం ఓ గౌరవం. ఆయన ఆన్ లొకేషన్ ప్రతి సన్నివేశం గురించి ఎంతగానో డీటెయిల్డ్‌గా ఉంటారు. తనతో నటించడం బావుంది.. అని అన్నారు. అన్నట్టు నాస్తికుడైన దర్శకుడితో `సుబ్రమణ్యపురం` చిత్రంలో నటించారు కదా? అంటే తాతకు కోపం వస్తుందేమో? అంటూ నాలుక కరుచుకున్నారు సుమంత్. నాస్తికుడు కాని, ఆస్తికుడు కాని తత్వంపై సినిమా చేశాను. దేవుడున్నాడో లేడో తెలియదు. దానిపైనే నా పాత్ర పరిశో్ధన సాగుతుందని సుమంత్ ఈ వారం రిలీజ్‌కి వస్తున్న తన చిత్రం గురించి చెప్పారు. ఏఎన్నార్ దేవుడిని నమ్మరు. ఆయన నాస్తికుడు. కానీ సుమంత్ మాత్రం గుడులకు, చర్చ్‌లకు వెళ్లినప్పుడు దణ్ణం పెట్టుకుంటానని చెప్పడం ఓ సర్ ప్రైజ్.