ఫ్లాప్ హీరో.. నెల రోజుల్లో మూడు సినిమాలు
హీరోగా నిలదొక్కుకోవడానికి దాదాపు రెండు దశాబ్దాలుగా కష్టపడుతున్నాడు సుమంత్. ఇన్నేళ్ల కెరీర్లో ‘సత్యం’.. ‘గోదావరి’.. లాంటి కొన్ని సినిమాలు మాత్రమే బాగా ఆడాయి. చివరగా అతడికి ‘మళ్ళీ రావా’ సినిమా కొంచెం ఊరటనిచ్చింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఒకటికి రెండు సినిమాలు లైన్లో పెట్టాడు సుమంత్. అందులో ఒకటైన ‘సుబ్రహ్మణ్యపురం’ ఈ నెల ఏడో తారీఖునే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ సుమంత్ పెట్టుకున్న ఆశల్ని అది నెరవేర్చలేకపోయింది. అతడి ఫ్లాపుల లిస్టులోకి చేరిపోయింది. ఇప్పుడిక సుమంత్ ఆశలు ‘ఇదం జగత్’ మీదే ఉన్నాయి. నిజానికి ‘సుబ్రహ్మణ్యపురం’ కంటే ముందు ఇదే విడుదల కావాల్సింది. అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఎంచుకున్నాడు సుమంత్.
తన గత సినిమా విడుదలైన మూడు వారాలకే దీన్ని కూడా దించేస్తున్నాడు సుమంత్. ఈ నెల 28న ‘ఇదం జగత్’ రిలీజ్ కానుంది. మూడు వారాల వ్యవధలో ఒక హీరో సినిమాలు రెండు రిలీజ్ కావడం అరుదైన విషయమే. విశేషం ఏంటంటే.. సుమంత్ ఇంకో పది రోజుల్లోనే మరో సినిమాతో పలకరించబోతున్నాడు. జనవరి 9న విడుదల కాబోయే ‘యన్.టి.ఆర్’లోనూ సుమంత్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నాడు సుమంత్.
మొత్తంగా నెల రోజుల వ్యవధిలో సుమంత్ నటించిన మూడు సినిమాలు రిలీజవుతున్నాయన్నమాట. గత మూడేళ్లలో సుమంత్ నటించిన ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ కాగా.. ఇప్పుడు నెల వ్యవధిలో మూడు సినిమాలంటే చిత్రమే. అనిల్ శ్రీకాంత్ రూపొందించిన ఈ చిత్రంలో సుమంత్ జర్నలిస్టుగా నటించాడు. ఇది హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘నైట్ క్రాలర్’ స్ఫూర్తితో తెరకెక్కినట్లు భావిస్తున్నారు.