బన్నీ మాటకు ఏడ్చేసిన సుకుమార్!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో ఇంతకుముందు 'ఆర్య' .. 'ఆర్య 2' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే ఆ సినిమాల కథలు వేరు .. వాటి నేపథ్యం వేరు. ఈ ఇద్దరి కలయికలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పుష్ప' నేపథ్యం వేరు. ఎందుకంటే పూర్తిస్థాయిలో అడవి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అందువలన కాగితం మీద పెట్టినంత తేలికగా సీన్ ను తెరపై చూపించడం సాధ్యం కాదు. అందుకు ఎంతో కష్టపడవలసి ఉంటుంది. అలాంటి కష్టానికి ప్రతిఫలంగానే ఈ రోజున 'పుష్ప' భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.
కొంతసేపటి క్రితం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ .. "పోయిన ఏడాది చివరిలో రోజులు చాలా డల్ గా గడిచిపోయాయి. అప్పుడు నేను అనుకున్నాను .. వచ్చే ఏడాది చివరిలో మాత్రం ఇలా ఉండకూడదు .. చాలా బాగుండాలని. 'పుష్ప' సక్సెస్ తో అలాంటి ఒక మంచి ఎండింగ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఇలా మీ అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ థ్యాంక్యూ మీట్ ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే ప్రతి సినిమాకి తెర వెనుక పనిచేసేవారు దాదాపు 350మంది వరకూ ఉంటారు.
ఒక్క ఫంక్షన్లో వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతూ కూర్చుంటే టీవీల్లో చూసేవారికి బోర్ కొడుతూ ఉంటుంది. కానీ వాళ్లకి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. మీకు అది కనెక్ట్ అయ్యే కంటెంట్ కాకపోవచ్చును .. కానీ మాకు అది జీవితం. ఈ రోజున సక్సెస్ వచ్చింది కనుక బాగానే ఉంది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఫ్లాప్ అయిన తరువాత మీడియా ముందు కనిపించి థ్యాంక్యూ అని ఏం చెబుతాం? ఇక పై నేను ఒకటి ఫిక్స్ అయ్యాను. ఇకపై సినిమా సక్సెస్ అయినా .. ఫ్లాప్ అయినా చివరి ఫంక్షన్ గా థ్యాంక్యూ మీట్ చేయాలని.
ఎందుకంటే ఒక హిట్ సినిమాకైనా .. ఒక ఫ్లాప్ సినిమాకైనా కష్టం ఒకటే. అందువలన ఇకపై నా ప్రతి సినిమాకి థ్యాంక్యూ మీట్ పెట్టాలని అనుకుంటున్నాను. నేను ఒకరికి థ్యాంక్స్ చెబుతున్నానంటే ఆ వ్యక్తి వెనక ఉన్న గ్రూప్ లోని వారందరికీ ఆ థ్యాంక్స్ చెందుతుంది. ఈ సినిమా నిర్మాతలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సుకుమార్ గారు ఇంతకు ముందు అన్నట్టుగా కేవలం తెలివి తేటలతో మాత్రమే కాదు, మంచి మనసుతో మీరు ఇంతదూరం వచ్చారు.
ఇక రష్మిక .. నా మనసుకు బాగా కనెక్ట్ అయిన అతి తక్కువ మందిలో ఆమె ఒకరు. తన సపోర్ట్ లేకపోతే నేను అంత బాగా చేసేవాడిని కాదేమో. హీరోయిన్ దగ్గర కంఫర్ట్ జోన్ లేకపోతే హీరో చేయలేడు. ఆ కంఫర్టును నాకు ఇచ్చిన రష్మికకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక సమంత సాంగ్ యూ ట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది .. అందుకు ఆమెకి థ్యాంక్స్ చెబుతున్నాను. దేవిశ్రీ ప్రసాద్ నా సినిమాలకు ఎన్నో పాటలను ఇచ్చారు. నన్ను జనాల మసుల్లోకి తీసుకుని వెళ్లిపోయారు. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను.
'ఆర్య' సినిమా చేసిన కొన్నాళ్లకి నేను ఒక కారు కొనుక్కున్నాను. దాని ఖరీదు 85 లక్షలు .. అద్దిరిపోయే స్పోర్ట్స్ కారు అది. ఆ కారు ఎక్కిన తరువాత నేను స్టీరింగ్ పై చేయిపెట్టి నేను ఇంత దూరం రావడానికి కారకులు ఎవరు అని ఆలోచించాను. అప్పుడు నా మనసులో మెదిలిన ఒకే ఒక వ్యక్తి సుకుమార్ గారు. డాళింగ్ నువ్వు లేకపోతే నేను లేను" అని బన్నీ అనగానే రెండు చేతులతో తన ముఖ్యం కప్పుకుని సుకుమార్ ఏడ్చేశాడు. పక్కనే కూర్చున్న దేవిశ్రీ ఆయనను సముదాయించడానికి ప్రయత్నించాడు.