సుక్కూని చైతూ అవమానించాడా?

Update: 2015-04-12 06:53 GMT
కొన్నిసార్లు కొన్ని తప్పిదాలు అనుకోకుండా జరుగుతుంటాయి. అవి అవతలివాళ్లు కావాలని చేయకపోయినా.. ఆ తప్పిదం కొంత ఇబ్బంది పెడుతుంది. ఇటీవలే నాగచైతన్య హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'దోచెయ్‌' ఆడియో వేడుకలో ఇలాంటి పొరపాటే ఒకటి జరిగింది.

నాగచైతన్య నటించిన సినిమాల ఆడియో-విజువల్‌ ప్రదర్శించినప్పుడు.. 'చైతన్య ఇంతవరకూ ఒక్క స్టార్‌ డైరెక్టర్‌తోనూ పనిచేయకపోయినా.. చక్కని విజయాలు అందుకున్నాడు' అంటూ వాయిస్‌ ఓవర్‌ వినిపించారు. అయితే అది విన్న సుకుమార్‌ అభిమానులు ఇర్రిటేట్‌ అయ్యారు ఆ క్షణం. చైతూ కెరీర్‌ సంధికాలంలో ఉన్నప్పుడు '100పర్సంట్‌ లవ్‌' అనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చింది సుకుమార్‌. అంతకంటే ముందే బన్నిని సూపర్‌స్టార్‌ని చేసింది సుకుమార్‌. ఆర్య చిత్రంతోనే బన్ని లెవలే మార్చేశాడు. టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా కొనసాగుతున్న మహేష్‌ని డైరెక్ట్‌ చేశాడు. ఇప్పుడు మరో సూపర్‌స్టార్‌ ఎన్టీఆర్‌ని డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇంత పెద్ద ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న సుక్కూని అంత మాటంటారా? పిలిచి మరీ ఇలా అవమానిస్తారా? అని సుక్కూ అభిమానులంతా ఫీలవుతున్నారు.

వాస్తవానికి ఈ ఎపిసోడ్‌లో చైతూ కానీ, సుధీర్‌ వర్మ కానీ దీన్ని ఊహించి ఉండరు. ఆ విజువల్‌కి వాయిస్‌ రాసినోడికి సినిమా పరిజ్ఞానం సరిగా ఉండి ఉండకపోవచ్చు. దాని ఫలితం మాత్రం పెద్దదే అనడానికి ఇదో ఎగ్జాంపుల్‌.

Tags:    

Similar News