సుక్కు మాట: మంచి జడ్జి అయితే చాలు

Update: 2018-04-16 15:36 GMT
ఒక దర్శకుడు మంచి రచయిత కావాల్సిన అవసరం లేదని.. మంచి జడ్జి అయితే చాలని అంటున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఒక మంచి డైలాగ్ రాయడం కంటే ఏ డైలాగ్ అయితే జనాలకు రుచిస్తుందో తెలియడం కీలకమని.. ఇది తెలిసిన వాళ్లే సినీ పరిశ్రమలో విజయవంతం కాగలరని సుకుమార్ అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా వర్ధమాన రచయితలు.. దర్శకులకు మీరేం చెబుతారని సుకుమార్‌ ను అడిగితే ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు. తాను ఏదో సాధించేశానని అనుకోవడం లేదని.. తాను ఎవరికీ ఏమీ చెప్పే స్థితిలో లేనని అంటూనే మంచి సూచన చేశాడు సుకుమార్.

సినీ రంగంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉంటారని.. ఐతే దేన్నయినా జడ్జ్ చేయగలిగే వాళ్లు తక్కువ అని సుకుమార్ అన్నాడు. ఒక సన్నివేశం పండుతుందా లేదా.. ఒక డైలాగ్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది చెప్పగలగడం ముఖ్యమైన విషయం అని.. దర్శకుడు ప్రధానంగా ఈ విషయంలో పక్కాగా ఉంటే విజయవంతం అవుతాడని సుకుమార్ చెప్పాడు. సుకుమార్ రచయితల బృందం చాలా పెద్దగానే ఉంటుంది. ఆయన తన ప్రతి సినిమాకూ అరడజను మందితో స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ రాయిస్తాడు. కానీ ప్రతి సన్నివేశంలో.. ప్రతి డైలాగ్ లో సుకుమార్ ముద్ర మాత్రం స్పష్టంగా ఉంటుంది. అంటే ఎవరు రాసినా.. అందులో తన శైలికి తగ్గ కంటెంట్ తీసుకుంటాడన్నమాట. ఈ జడ్జిమెంటే సుకుమార్ ను విలక్షణంగా నిలబెడుతుంది. ఆ విషయం మీదే పై సలహా ఇచ్చాడు సుక్కు.
Tags:    

Similar News