టాప్ లెస్ గా నటించడానికి రెడీ అనేసింది

Update: 2017-04-25 11:38 GMT
సుజా వరుణి.. తమిళంలో దశాబ్దానికిపైగా నటిగా కొనసాగుతున్న అమ్మాయి. నాగవల్లి.. గుండెల్లో గోదారి లాంటి తెలుగు సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ ఈ అమ్మాయి పరిచయమే. ఐతే చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. ఈ అమ్మాయికి పెద్ద స్థాయి అవకాశాలు రాలేదు. చిన్నా చితకా పాత్రలు.. వ్యాంప్ క్యారెక్టర్లు లాంటివే ఎక్కువ చేసింది. కొన్ని సినిమాల్లో కొంత మేర అందాల ప్రదర్శన చేసినప్పటికీ కెరీర్ ఊపందుకోలేదు. ఎలాగైనా పెద్ద అవకాశాలు అందుకోవాలన్న డెస్పరేషన్లో ఈ అమ్మాయి సంచలన ప్రకటన చేసింది. అవసరమైతే తాను టాప్ లెస్ గా కనిపించడానికి కూడా సిద్ధమని ఈ అమ్మాయి ప్రకటించింది.

‘‘అవసరమైతే టాప్ లెస్ గా కనిపించడానికి నేను సిద్ధం. అదే సమయంలో గ్లామరస్ పాత్రలే చేస్తానని అనట్లేదు. అసలు గ్లామర్ అవసరమే లేకుండా ఎలాంటి పాత్ర చేయడానికైనా కూడా నేను సిద్ధం. విద్యాబాలన్.. కంగనా రనౌత్.. రాధికా ఆప్టే లాంటి హీరోయిన్ల మాదిరిగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుంది. అందుకోసం ఎలా కనిపించడానికైనా నేను రెడీ’’ అని సుజా తెలిపింది. విద్యాబాలన్.. కంగనా.. రాధికా లాంటి హీరోయిన్ల స్థాయి వేరు. సుజా రేంజేంటో కోలీవుడ్లో ఎవరిని అడిగినా చెబుతారు. కేవలం టాప్ లెస్ గా నటించేస్తే రేంజ్ పెరిగిపోదు. అలా నటించాల్సిన అవసరం ఏంటో కూడా చూసుకోవాలి. మరి సుజా చేసిన ప్రకటనతో ఆమెకు ఎలాంటి అవకాశాలు వచ్చిపడతాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News