'200% సుశాంత్ ది హత్యే.. ఆత్మహత్య కాదు'

Update: 2020-09-25 10:30 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చిందని ప్రశ్నిస్తూ.. సుశాంత్ కేసులో దోషులను శిక్షించి అతని ఫ్యామిలీకి న్యాయం జరగాలని సుశాంత్ సపోర్టర్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ 'సుశాంత్ సింగ్ ని గొంతు నులిమి చంపడం వల్లనే చనిపోయాడనని.. అతనిది ఆత్మహత్య కేసు కాదని' పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఎయిమ్స్ డాక్టర్ కి పంపిన ఫోటోలను చూసి సుశాంత్ ని గొంతు పిసికి చంపినట్లు సూచిస్తున్నట్లు తనతో చెప్పాడని చెప్పుకొచ్చాడు.

కాగా, వికాస్ సింగ్ దీని గురించి ట్వీట్ చేస్తూ.. ''సుశాంత్ మృతి కేసులో సిబిఐ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తుండటం వల్ల నిరాశకు గురవుతున్నాను. ఎయిమ్స్ బృందంలో భాగమైన ఒక డాక్టర్ కొన్ని రోజుల క్రితం నేను పంపిన ఫోటోలు చూసి 200% ఇది గొంతు పిసకడం వల్లనే జరిగింది ఆత్మహత్య కాదు అని చెప్పాడు'' అని పేర్కొన్నాడు. అయితే దీనిపై ఎయిమ్స్ ప్యానెల్ చీఫ్ సుధీర్ గుప్తా ఓ నేషనల్ మీడియా ఛానల్ వారితో మాట్లాడుతూ.. ''ఫోటోలలో లిగెచర్ గుర్తులు చూడటం ద్వారా హత్య లేదా ఆత్మహత్య అని నిర్ధారణ చేయలేము. ఇది వైద్యులకే చాలా కష్టమైంది. ఇక సాధారణ వ్యక్తులు ఈ విషయాన్ని తేల్చడం అసాధ్యం. దీనికి ఫోరెన్సిక్ రిపోర్ట్ అవసరం'' అని చెప్పారు.
Tags:    

Similar News