'ఆ అమ్మాయి గురించి చెప్పాలని' సుధీర్ అంటోంది.. నిజమేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లమెల్లగా డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు యువహీరో సుధీర్ బాబు. మొదటినుండి కూడా వెరైటీ సినిమాలతో అలరిస్తున్నాడు. అయితే హిట్స్ ప్లాప్స్ అనేవి పక్కనపెడితే సుధీర్ మాత్రం రొటీన్ సినిమాలు చేయడంలేదు. గతేడాది వి అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అంతేగాక అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఆ సినిమాలో ప్రధానహీరోగా నాని నటించాడు. పోలీస్ అధికారిగా సుధీర్ కనిపించాడు. అయితే ప్రస్తుతం సుధీర్.. శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేస్తున్నాడు. పలాస ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధీర్ సూరి అనే క్యారెక్టర్ చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. సుధీర్ తదుపరి సినిమా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేయనున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఆ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా ఖరారు అయింది. అయితే ఈ సినిమాకు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే టైటిల్ పరిశీస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ఇది. ఇదివరకే సమ్మోహనం, వి సినిమాలకు కలిసి పనిచేసారు. మరోవైపు హీరోయిన్ కృతిశెట్టి కూడా వరుస సినిమాలను ఓకే చేస్తోంది. ఇప్పటికే ఉప్పెన సక్సెస్ ఎంజాయ్ చేస్తూ.. నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తోంది. చూడాలి మరి ఈ కాంబో టైటిల్ అదేనో కాదో!