రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెడుతున్న స్టార్ హీరోయిన్

Update: 2021-09-04 15:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తండ్రి ప్రకాష్ పదుకొనే బెంగళూరులో తాము కొనుగోలు చేసిన సర్వీస్ అపార్ట్‌మెంట్ ను రూ.6.79 కోట్లకు రిజిస్టర్ చేసుకున్నారని తెలుస్తోంది. 7 ఆగస్టు 2021 న ఈ కొనుగోలు జ‌రిగింద‌ని స‌మాచారం. రూ .34.64 లక్షలు స్టాంప్ డ్యూటీని ప్ర‌కాష్ ప‌దుకొనే చెల్లించారు.

2BHK ప్రైవేట్ నివాసం సౌత్ టవర్ 22 వ అంతస్తులో (BBMP మంజూరు ప్రణాళిక ప్రకారం 20 వ అంతస్తు) 3451.37 చదరపు అడుగుల సూపర్ బిల్ట్-అప్ ఏరియాను కలిగి ఉంది. ఎంబసీ వన్ ఫోర్ సీజన్స్ ప్రైవేట్  అనే ప్రాజెక్ట్ లో ఈ అపార్ట్ మెంట్ ఉంది. ఇందులో వారికి రెండు కార్ పార్కింగ్ లు ఉన్నాయి. గతంలో సిటీ వ్యూ అపార్ట్‌మెంట్స్ లోనూ దీపిక‌- ప్ర‌కాష్ ఖ‌రీదైన అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిన‌దే.

ఈ ప్రాజెక్ట్ బెంగుళూరులోని గంగనగరలోని బళ్లారి రోడ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టిన మొట్టమొదటి వ్యక్తులలో పదుకొనే ఒకరు. అపార్ట్మెంట్ 2012 లో కొనుగోలు చేసారు. బాలీవుడ్ లో వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేస్తూ దీపిక భారీగా ఆర్జిస్తోంది. ఆ క్ర‌మంలోనే త‌న పెట్టుబ‌డుల్ని ఖ‌రీదైన ఏరియాల్లో రియ‌ల్ వెంచ‌ర్ల‌పై పెట్టుబ‌డిగా పెడుతున్నార‌ని తెలిసింది. దీపిక పదుకొనె కార్యాలయాన్ని సంప్ర‌దించినా దీనిపై ఎలాంటి ప్రతిస్పందన లేదని ముంబై మీడియా పేర్కొంది.

ఆర్జ‌న‌లో నంబ‌ర్-1 హీరోయిన్ గా రికార్డ్

బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణే క్రేజ్ అసాధ‌ర‌ణం. హిందీ చిత్ర‌సీమ‌లో ఐశ్య‌ర్యారాయ్.. క‌రీనా క‌పూర్ త‌ర్వాత అంతటి పాపుల‌ర్ స్టార్ గా వెలిగిపోతోంది. ఇంకా చెప్పాలంటే  ఆ ఇద్ద‌రినీ మించిన‌ స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తోంది. `రామ్ లీలా`- `బాజీరావ్ మ‌స్తానీ`-`ప‌ద్మావ‌త్` చిత్రాల‌తో దీపిక ఇమేజ్ అమాంతం పెరిగింది. బాలీవుడ్ హీరోయిన్ల‌లోనే అత్య‌ధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్ గా ఇప్ప‌టికే ఫోక‌స్ అయింది. క‌థానాయ‌కుల‌కు ధీటుగా దీపిక పారితోషికాలు అందుకుంటోంది.

అంతేకాదు.. దీపిక ఇటీవ‌ల భారీ పారితోషికం డిమాండ్ చేస్తోంది. బాలీవుడ్ హీరోల‌కు ధీటుగా త‌న‌కు కూడా పారితోషికం ఇవ్వాల్సిందేన‌ని  కండీష‌న్లు పెడుతోందని క‌థ‌నాలొచ్చాయి. ఇటీవ‌ల‌ సంజ‌య్ లీలా భ‌న్సాలీ చిత్రానికి భారీ పారితోషికం డిమాండ్ చేయ‌గా..  ఈ సినిమా నుంచి దీపికా ప‌దుకొణే త‌ప్పుకుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.  ర‌ణ్ వీర్ సింగ్ కి ఎంత పారితోషికం ఇస్తున్నారో అంతే పారితోషికం త‌న‌కు ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేయ‌గా నో చెప్ప‌డం సంచ‌ల‌న‌మైంది.

మొత్తానికి దీపిక ప‌దుకోణే ముక్కు పిండి వ‌సూలు చేస్తోంది. ఇక వ్యాపారాల్లోనూ పురుషుల‌కు ధీటుగా ఎదిగే ప్ర‌ణాళిక‌ల్లో దీపిక ఉంది.దీపిక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాలో న‌టిస్తోంది. ఈ మూవీతో పాటు అల్లు రామాయ‌ణం ఫ్రాంఛైజీలోనూ న‌టించ‌నుంది. వీటి కోసం భారీ పారితోషికాలు కావాల‌ని దీపిక ప‌ట్టుబ‌డుతోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇక ప్ర‌భాస్ తో స‌మాన ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని ఇంత‌కుముందే దీపిక ఘ‌ర్ష‌ణ పడిన సంగ‌తి తెలిసిన‌దే.

దీపిక ఇలా ఆర్జిస్తున్న మొత్తాల్ని మెట్రో న‌గ‌రాల్లో రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెడుతోంది. దీపిక‌కు ముంబై - బెంగ‌ళూరు స‌హా ప‌లు మెట్రో న‌గ‌రాల్లో లెక్క‌కు మించిన ఆస్తులున్నాయ‌ని ఇంత‌కుముందు క‌థనాలొచ్చాయి.  కేవ‌లం దీపిక మాత్ర‌మే కాదు.. ఇండ‌స్ట్రీల్లో ప‌లువురు క‌థానాయిక‌లు ఇదే త‌ర‌హాలో రియ‌ల్ వెంచ‌ర్ల వ్యాపారంలో ఉన్నారు. టాలీవుడ్ వెట‌ర‌న్ నాయిక ర‌మ్య‌కృష్ణ స‌హా అనుష్క త‌దిత‌రులు రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డులు పెట్టిన సంగ‌తి తెలిసిన‌దే.
Tags:    

Similar News