కంటెంట్ బాగుంటే ఓటీటీ ఎంట్రీకి రెడీ అంటున్న స్టార్ హీరో...?
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మాస్ మహారాజా రవితేజ ట్రెండ్ కి తగ్గట్లుగా తన కెరీర్ ని మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. డిజిటల్ వరల్డ్ లో రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యమని భావిస్తున్న నటీనటులు దర్శక నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఇక స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీలతో అగ్రిమెంట్స్ చేసుకుంటూ అవి పెట్టిబడి పెట్టి నిర్మించే సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. నవాజుద్ధీన్ సిద్ధిఖీ - రాధికా ఆప్టే వంటి స్టార్స్ ఓటీటీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఒరిజినల్ మూవీస్ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది.
కాగా, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాను నటించిన నిర్మించిన సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య ప్రొడ్యూస్ చేసిన 'పొన్మగల్ వందాల్' ఇప్పటికే రిలీజ్ అవగా.. తాను నటించిన 'ఆకాశమే నీ హద్దురా' సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. అయితే సూర్య ప్రముఖ ఓటీటీతో అగ్రిమెంట్ చేసుకొని వారు నిర్మించే సినిమాల్లో నటించేందుకు ఒప్పందం చేసుకున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదే ఆఫర్ రవితేజకు కూడా ఇవ్వడానికి ఓటీటీలు రెడీ అయ్యాయట. రవితేజ కూడా దీనికి సానుకూలంగా స్పదించారని.. కథ బాగుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే రెమ్యూనరేషన్ లో మాత్రం తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లుగా ఓటీటీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.