కంప్యూట‌ర్ హ్యాక‌ర్‌గా స్టార్ డైరెక్ట‌ర్‌

Update: 2021-12-18 04:21 GMT
తెర వెన‌క వుండి వెండితెర‌పై మ‌ర‌పురాని చిత్రాల‌ని అందించిన స్టార్ డైరెక్ట‌ర్స్ తెర‌పై మెరుస్తూ త‌మ‌దైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న విష‌యం తెలిసిందే. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా, విల‌న్‌లుగా ఆక‌ట్టుకుంటూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటిన ఎస్‌. జె. సూర్య విల‌న్‌గా మారి ఆక‌ట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇదే త‌ర‌హాలో విల‌క్ష‌ణ చిత్రాల ద‌ర్శ‌కుడు సెల్వరాఘ‌వ‌న్ న‌టుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.

త‌మిళ చిత్రం `సాని కాయిధ‌మ్‌` చిత్రంతో న‌టుడిగా ఆయ‌న ప‌రిచ‌యం కాబోతున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ మొద‌లైన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కూడా డీగ్లామ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు సెల్వ‌రాఘ‌వ‌న్ మ‌రో చిత్రాన్ని అంగీక‌రించారు. ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ పై క‌ళానిధి మార‌న్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం చెన్నైలో పూర్త‌యింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ కీరోల్ లో క‌నిపిస్తార‌ని, ఇందులో ఆయ‌న కంప్యూట‌ర్ హ్యాక‌ర్ గా క‌నిపించ‌నున్నార‌ని తెలిసింది. ఈ పాత్ర కోసం సెల్వ‌రాఘ‌వ‌న్ భారీ స్థాయిలో పారితోషికాన్ని డిమాండ్ చేశార‌ని చెబుతున్నారు. మాస్ డ్రామా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో హీరో విజ‌య్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా యంగ్ గా క‌నిపించ‌నున్నార‌ట‌.


Tags:    

Similar News