• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్27 ను మహేష్ బాషా...

మహేష్27 ను మహేష్ బాషా అంటున్నారేంటబ్బా?

By - Tupaki Desk
Update: 2020-02-05 08:29 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాను వంశీ  పైడిపల్లి దర్శకత్వం లో చేస్తున్న సంగతి తెలిసిందే. #మహేష్27 గా వ్యవహరించే ఈ సినిమా కు ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక డాన్ పాత్రలో కనిపిస్తారని.. వైజాగ్ పోర్ట్ అంతా మహేష్ కను సన్నల్లో ఉంటుందనే విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది.

ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తారని ప్రచారం సాగుతోంది కానీ అది నిజం కాదట. మహేష్ డ్యూయల్ క్యారెక్టరైజేషన్ లో కనిపిస్తారట. ఆ రెండు షేడ్స్ కూడా పూర్తి విభిన్నంగా ఉంటాయట. డాన్ గా కనిపించడం సినిమాకు కీలకమని..అయితే మరో షేడ్ లో ఒక ప్రొఫెసర్ గా కనిపిస్తారని సమాచారం. మహేష్ కెరీర్ లో ఇలా ప్రొఫెసర్ గా కనిపించడం మొదటిసారి. రజనీకాంత్ కు 'బాషా' ఎలాగో మహేష్ బాబు కు ఈ సినిమా అలాగేనని #మహేష్27 టీమ్ కు సన్నిహితంగా ఉండేవారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే 'బాషా' అనేది ఒక క్లాసిక్ ఫిలిం. 'బాషా' తర్వాత ఆ జోనర్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఒక్క సినిమా కూడా 'బాషా' స్థాయిలో నిలవలేదు. మరి ఈ సినిమా స్క్రిప్ట్ పై అంత నమ్మకంగా ఉన్నారంటే గొప్ప విషయమే. సినిమా రిలీజ్ అయితే కానీ అది నిజమా కాదా అనేది తెలియదు.

వంశీ పైడిపల్లి - మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన గత చిత్రం 'మహర్షి' మంచి విజయం సాధించింది. #మహేష్27 తో వంశీ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చెయ్యగలడా అనేది వేచి చూడాలి. ఈ సినిమాను మార్చ్ లో లాంచ్ చేస్తారని సమాచారం.
Tags:    
  • Ssmb27 Movie Latest Updates 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS