సూపర్ స్టార్ తన నెక్స్ట్ సినిమా కోసం జెట్ స్పీడ్ వేగాన్ని చూపిస్తాడా..?

Update: 2020-04-14 09:10 GMT
సూపర్ స్టార్ మహేష్ కెరీర్లో ఇప్పటి వరకు 26 సినిమాల్లో నటించాడు. కెరీర్ ప్రారంభంలో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే మహేష్ ఆ తర్వాత వరుసగా సినిమాలని లైన్ లో పెడుతూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. కరోనా వైరస్ ప్రభావ పరిస్థితులు లేకుండా ఉండే ఈ పాటికే తన కెరీర్లో 27వ చిత్రాన్ని పట్టాలెక్కించేవాడు. మహేష్ కెరీర్ లో చాలా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసిన సినిమాలుగా బిజినెస్ మ్యాన్ - ఆగడు - సరిలేరు నీకెవ్వరూ అని చెప్పవచ్చు. బిజినెస్ మ్యాన్ సినిమాను కేవలం రెండున్నర నెలల్లో పూర్తి చేసారు మహేష్. రీసెంటుగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా రెగ్యులర్ షూటింగ్ గత ఏడాది జూలై నెలలో ప్రారంభించి సంక్రాంతి రేసులో నిలిపాడంటేనే అర్థం చేసుకోవచ్చు మహేష్ ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసాడని. అయితే ఇప్పుడు అదే స్పీడ్ తన నెక్స్ట్ సినిమాలో మెయింటైన్ చేస్తాడని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.

మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాని 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో చేయబోతున్నాడని సమాచారం. ఈ న్యూస్ అధికారికంగా బయటకి రానప్పటికీ అదే నిజమయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. మనకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని మే 31న అఫిసియల్ గా స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. ప్రతి ఏడాది మహేష్ చిత్రానికి సంబంధించిన ఏదొక అప్ డేట్ ఇవ్వడం మహేష్ బాబుకి సెంటిమెంటుగా వస్తోంది. ఈ విధంగా తన కెరీర్లో 27వ చిత్రాన్ని అదే రోజు స్టార్ట్ చేయబోతున్నాడట. కరోనా వైరస్ ప్రభావ పరిస్థితులను బట్టి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు మళ్ళీ సరిలేరు నీకెవ్వరూ సినిమాలాగే జెట్ స్పీడ్ తో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే సూపర్ స్టార్ కెరీర్లో వచ్చే 27వ సినిమా 2021 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇదే కనుక జరిగితే సూపర్ స్టార్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. వీరు గతంలో మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' అనే బ్లాక్ బస్టర్ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఆ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News