• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SSMB 28: ఇద్దరికి పెద్ద...

SSMB 28: ఇద్దరికి పెద్ద సినిమానే!

By - Tupaki Desk
Update: 2022-08-19 09:43 GMT
అల..వైకుంఠపురములో.. సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత తన తదుపరి సినిమాను స్టార్ట్ చేయడానికి మాత్రం చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒక విధంగా మహేష్ కారణంగానే ఈ ప్రాజెక్టు కొంత ఆలస్యమైంది.

ఎందుకంటే మహేష్ ఈ సినిమా స్క్రిప్ట్ పై పూర్తిస్థాయిలో నమ్మకం గా అనిపించే వరకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారు. ఇక మహేష్ సందేహాలన్నిటికీ కూడా త్రివిక్రమ్ ఎంతో ఓపికతో సమాధానాలు చెబుతూ ఫైనల్స్ స్క్రిప్ సిద్ధం చేసి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు.

ఇక మొత్తానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఎస్ఎస్ఎంబి 28 సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బడ్జెట్ విషయాలపై కూడా ప్రస్తుతం అనేక రకాల కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇన్ సైడ్ టాక్  ప్రకారమైతే ఈ సినిమా బడ్జెట్ మహేష్ బాబు కెరీర్ లోనే కాకుండా త్రివిక్రమ్ కెరీర్ లో కూడా చాలా ఎక్కువ అని తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ స్థాయి బడ్జెట్లో ఈ ఇద్దరు కూడా సినిమాలు చేసింది లేదు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ కాంబో పై అంచనాలు అయితే హై రేంజ్ లోనే ఉంటాయి. ఇక హారిక హాసిని సంస్థకు కూడా ఇది బిగ్గెస్ట్ మూవీ. దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. రెమ్యునరేషన్స్ తో మొత్తంగా కలుపుకొని ఈ స్థాయిలో బడ్జెట్ అయినట్లు సమాచారం.

ఈ సినిమాను హారిక హాసినితో పాటు త్రివిక్రమ్ కూడా మరొక భాగస్వామి గా అయితే ఉన్నాడు. లాభాల్లో ఆయన వాటా అందుకోబోతున్నాడు. ఇక మహేష్ మాత్రం ఈ సినిమాకు కేవలం రెమ్యునరేషన్ మాత్రమే అందుకుంటాడు. ఇంతకుముందు అంటే  లాభాలు కూడా వచ్చే విధంగా తన GMB ప్రొడక్షన్ ను అనుసంధానం చేసిన మహేష్ SSMB28 కి మాత్రం అలా చేయడం లేదు. ఎందుకంటే ఆ తరహా ప్లానింగ్ కు త్రివిక్రమ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.
Tags:    
  • SuperStar 
  • MaheshBabu 
  • Trivikram 
  • SSMB28 
  • HarikaHassine 
  • Production 
  • Athadu 
  • Khaleja 
  • GMB 
  • TupakiNews 
  • MovieNews 

Similar News

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS