వాళ్లను స్టార్స్ ను చేసింది పూరినే : రాజమౌళి

Update: 2021-11-01 16:40 GMT
జక్కన్న రాజమౌళి కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అనడంలో సందేహం లేదు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున ఆయన సినిమాలు వసూళ్లను సాధిస్తాయి. బాలీవుడ్ సినిమాలను మించి వసూళ్లు దక్కించుకున్న ఘనత ఆయనకే సాధ్యం. అలాంటి రాజమౌళి పూరి జగన్నాద్‌ ను పదే పదే ప్రశంసలతో ముంచెత్తుతూ ఉంటాడు. గతంలో పూరి గారి నుండి స్పీడ్‌ గా సినిమాలు తీయడం ఎలాగో నేర్చుకోవాలని ఉందంటూ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కూడా ఒక సారి పూరి పై ప్రశంసల వర్షం కురిపించాడు. పూరి ఒక గొప్ప వ్యక్తి.. గొప్ప దర్శకుడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా మరోసారి రాజమౌళి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పూరి జగన్నాద్‌ పై ప్రశంసలు కురిపించాడు.

ప్రభాస్ ను పూర్తిగా మార్చేసిన ఘనత పూరి గారికే దక్కుతుంది. బుజ్జిగాడు సినిమా తర్వాత ప్రభాస్‌ స్టైల్‌ పూర్తిగా మారింది. ప్రభాస్ ను కొత్తగా చూపించడంతో పాటు ఒక స్టార్‌ హీరోగా నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పుకొచ్చాడు. కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా పవన్‌ కళ్యాణ్‌.. మహేష్‌ బాబు.. రవితేజ.. ఎన్టీఆర్‌ వంటి హీరోలను మాస్ గా చూపించి స్టార్స్ గా మంచి పేరు దక్కించుకోవడంలో పూరి దే ప్రథాన పాత్ర అనడంలో సందేహం లేదని రాజమౌళి పేర్కొన్నాడు. పూరి జగన్నాధ్ ఒక విభిన్నమైన దర్శకుడు. ఆయన స్టైల్‌ మరియు టేకింగ్‌ నాకు నచ్చుతాయి అంటూ పూరి ని మరోసారి కి ఆకాశానికి ఎత్తేలా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేయిస్తున్నాడు. భారీ ఎత్తున విడుదల చేయబోతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే ముగిసింది. కరోనా వల్ల ఆలస్యం అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇటీవల వచ్చిన గ్లిమ్స్‌ తో సినిమా ఏ రేంజ్‌ లో ఉంటుందో చెప్పకనే చెప్పాడు. నిమిషం కంటే తక్కువే ఉన్న ఆ వీడియో సినిమా రేంజ్ ను అమాంతం పెంచేసింది. అద్బుతమైన విజువల్స్ తో పాటు ఒల్లు గగుర్లు పొడిచే యాక్షన్‌ సన్నివేశాలు సినిమాలో ఉంటాయని దాన్ని బట్టి అర్థం అవుతోంది. అలాంటి గొప్ప సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి ఏమాత్రం గర్వం లేకుండా పూరి జగన్నాద్‌ ను పొగడటం అంటే ఆయన గొప్పతనంకు నిదర్శణం అంటూ జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News