• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా ట్యాక్సీ ఎక్కిన...

మెగా ట్యాక్సీ ఎక్కిన పటాస్ పోరి

By - Tupaki Desk
Update: 2016-03-08 07:30 GMT
సాయిధరం తేజ్ - రాశిఖ్నా జంటగా నటిస్తున్న మూవీ సుప్రీం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ పిక్చరైజ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ అనగానే ముందు గుర్తొచ్చేది ఫైట్లు - డ్యాన్సులే. తేజు కూడా ఈ విషయంలో తక్కువేం కాదు. పాటల్లో డ్యాన్సులు ఇరగదీసేస్తున్నాడు. అదే ఇక ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఎలా రెచ్చిపోతాడో అర్ధం చేసుకోవచ్చు.

సుప్రీం మూవీలో 'వాలా వాలా వాలా.. మై హూ ట్యాక్సీవాలా' అంటూ సాగే పాటను ఇప్పుడు పిక్చరైజ్ చేస్తున్నారు. హై ఓల్టేజ్ ఎనర్జీకి మారు రూపంలా ఉండే సాయిధరం తేజ్.. ఇప్పుడు డ్యాన్సులు ఇరగదీసేస్తూ చేస్తున్నాడు. ఈ పాటలో తేజుకు జంటగా ఓ హీరోయిన్ నటిస్తుండడం విశేషం. పటాస్ మూవీలో హీరోయిన్ గా నటించి శృతి శోధి.. తేజు పక్కన సుప్రీంలో ఐటెం భామగా కనిపిస్తోంది. పటాస్ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి.. ఐటెం భామగా చేసేందుకు ఒప్పించాడట. ఈ ఇంట్రడక్షన్ సాంగ్ లో శృతి డ్యాన్సులు ఇరగదీసేస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ డ్యాన్స్ అందిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ ని కొత్తగా చూపిస్తున్నామని.. ఇంకో నాలుగు రోజుల్లో టాకీ మొత్తం కంప్లీట్ అయిపోతుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. సుప్రీం మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో సాయిధరం తేజ్ కి జంటగా రాశి ఖన్నా పోలీస్ పాత్రలో కనిపించనుంది.
Tags:    
  • Sruthi Sodhi 
  • Supreme Movie 
  • Telugu NEWs 

Similar News

ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?

2026-11-21 09:59 GMT

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

2026-11-21 09:53 GMT

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

2026-11-21 09:52 GMT

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

2026-11-21 09:51 GMT

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...

2026-11-21 08:38 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

2026-11-21 08:35 GMT

సమంత కొడుకు పేరు వెనుక కథ ఏమిటి?

2026-11-21 08:35 GMT

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

2026-11-21 08:35 GMT

పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!

2026-11-21 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS