• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాన్ ఇండియా సినిమాలో...

పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఏజెంట్ బ్యూటీ..!

By - Tupaki Desk
Update: 2020-06-29 06:00 GMT
ఇండియన్ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'భారతీయుడు'. 1996లో విడుదలైన ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకొని అటు కమల్ కెరీర్లో.. డైరెక్టర్ శంకర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అవినీతిని అరికట్టించే ఓ సామాన్యుడి ప్రణాళికల ప్రధానాంశంగా రూపొందింది భారతీయుడు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా డైరెక్టర్ శంకర్.. మరోసారి కమల్ హాసన్ హీరోగా 'భారతీయుడు 2' సినిమాను రూపొందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటినుండి ఆటంకాలను ఎదుర్కొంటూనే ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు అవాంతరాలు అడ్డుగోడల్లా ఎదురవుతున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రేన్ విరిగిపడి షూటింగ్ స్థలంలో ఘోరమైన ప్రమాదం వాటిల్లి ప్రాణనష్టం జరిగింది. ఆ ప్రమాదం నుండి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దాం.. అనుకునేలోపు కరోనా వైరస్ విజృంభించింది. ఇక లాక్ డౌన్ వల్ల అనుకున్న షెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే ఏర్పాట్లు చేస్తుందట చిత్రయూనిట్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ నటించనుందట. గతేడాది 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన శృతిశర్మ కమల్ ఈ భారీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. మరి ఈ వార్త నిజమేనా.. శృతి ఎలాంటి పాత్ర చేయబోతుంది..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ఇక అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనట.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • sruthi sharma 
  • indian 2 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

రామాయణం బడ్జెట్‌లో 9 శాతంతో తెరకెక్కిన గాడ్జిల్లా మైనస్ జీరో దూకుడు!

2026-11-09 06:05 GMT

జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!

2026-11-09 05:26 GMT

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS