అల్లూ వారబ్బాయికి యు/ఎ ఇచ్చారు

Update: 2016-07-27 09:31 GMT
సినిమాలో ఎక్కడ చూసినా కామెడీయే. విపరీతమైన ఫైట్లు.. రక్తప్రవాహాలు లేనేలేవు. అయినాసరే అల్లూ వారబ్బాయికి యు/ఎ సర్టిఫికేట్ చేతిలో పెట్టడం అనేదే ఇప్పుడు ఫిలిం నగర్‌ లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ పదండి ఈ కహానీ ఏంటో చూసేద్దాం.

''శ్రీరస్తు శుభమస్తు'' అంటూ ఆగస్టు 5న రావడానికి అన్ని విధాల సిద్దపడిపోయాడు అల్లు శిరీష్‌. పైగా ఇది గీతా ఆర్ట్స్ వారు చేసిన సినిమాయే కావడంతో.. హిట్టు కొట్టడం అనేదే ఇప్పుడు ప్రెస్టీజియస్ విషయం. ఇకపోతే సినిమాను చూసిన సెన్సార్ వారు.. ఇప్పుడు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. బహుశా హీరోయిన్ లావణ్య త్రిపాఠి గ్లామర్ డోస్ కారణంగా ఈ 'ఎ' వచ్చిపడిందేమో. ఇక సినిమాలో కామెడీ కంటంట్ తో పాటు.. ఎమోషనల్ సీన్లు కూడా బాగా పండాయని సెన్సార్ వారు చెప్పారట. సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు అల్లూ అండ్ టీమ్.

సోలో ఫేం పరశురామ్ డైరక్షన్ లో రూపొందిన ఈ సినిమాలో అల్లు శిరీష్‌.. లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్స్ లో నటిస్తుంటే.. ప్రకాష్‌ రాజ్‌ మరియు రావు రమేష్‌ లు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందించాడు.
Tags:    

Similar News