జగపతి బాటలో మరో హీరో?
హీరో శ్రీకాంత్ టాలీవుడ్ లో పెద్ద విలన్ అవుదామని ఇండస్ర్టీకి వచ్చాడు. కానీ ఆయన్ను పరిశ్రమ పెద్ద ఫ్యామిలీ హీరోను చేసిసింది. సెంచరీ హీరోగా పాపులర్ అయ్యాడు. అయితే ఇటీవలి కాలంలో ట్రెండ్ మారిపోయింది. శ్రీకాంత్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. శాటిలైట్ పరంగా మార్కెట్ తగ్గింది. దాంతో తన వైపు చూసే దర్శక, నిర్మాతలు కూడా తగ్గారు. విషయాన్ని ముందే గమనించిన శ్రీకాంత్ కూడా ఈగోకు పోకుండా స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ల వైపు మొగ్గు చూపిస్తున్నాడు.
కెరీర్ బాగా వెలిగినప్పుడే .. చిరంజీవి - వెంకటేష్ - నాగార్జున - రామ్ చరణ్ ఇలా టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో నటించాడు. ఇప్పుడు చరణ్, బన్ని వంటి యంగ్ జనరేషన్ సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలోను అలాంటి అవకాశాలు కూడా తగ్గాయి. కొందరు దర్శక, నిర్మాతలు సాహసం చేసి శ్రీకాంత్ తో తెరకెక్కించిన నాటు కోడి - వీడికి దూకుడెక్కువ - ఢీ అంటే ఢీ - జల్సా రాయుడు - మొండోడు వంటి సినిమాలు ఇంకా విడుదలకు నోచుకోలేదు.
అందుకే ఇక రూట్ మార్చాలనుకుంటున్నాడట. జగపతి బాబులా కరుడుగట్టిన విలన్ పాత్రలను పోషించాలనుకుంటున్నాడని ఇన్ సైడ్ టాక్. అయితే ఆయన విలన్ గా మెప్పించాలంటే చాలా కసరత్తు చేయాలి. ముఖ్యంగా టాలీవుడ్ లో జగపతి బాబు ఇప్పుడు విలన్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆయనకు పోటీగా నిలిస్తే నే శ్రీకాంత్ నిలబడగలడు. ఏది ఏమైనా ఈ సెకెండ్ ఇన్నింగ్స్ శ్రీకాంత్ కు పెద్ద పరీక్ష.