అమ్మాయిల లిక్కర్ వీడియోలు తీస్తే అది పగులగొట్టండి

Update: 2020-05-08 07:15 GMT
మద్యం జాతరకు ప్రభుత్వాలు తెరతీయడంతో క్యూలైన్లలో మందుబాబుల ఫొటోలు, వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అయితే మగపుంగవులే కాదు.. మహిళలు కూడా మద్యం కోసం క్యూలు కట్టడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మహిళల మద్యం కాంక్షపై సోషల్ మీడియాలో చర్చ మొదలు కావడంతో వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించారు. మద్యం తాగేందుకు మహిళలకు స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నించారు? మద్యం షాపుల ముందు మద్యం కొంటున్న మహిళలు కనిపిస్తే ఫొటోలు, వీడియోలు తీసి రచ్చ చేస్తున్నారని.. అమ్మాయిలు మందు కొనకూడదా? మీ గోల ఏంటిరా అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు.

మగాళ్లు కష్టాలు మరిచిపోవడానికి మద్యం తాగుతరని.. మీకు కష్టాలు ఉన్నట్టే ఆడవాళ్లకు ఉంటాయని.. వాళ్లు మద్యం కొని తాగకూడదా అని శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రతీ ఒక్కరికి సమాన హక్కులుంటాయని.. ఆడవారు వినియోగించుకోవాల్సిందే అంటూ అమ్మాయిలను శ్రీరెడ్డి వెనకేసుకొచ్చారు.

ఇక శ్రీరెడ్డి అంతటితో ఆగకుండా చరిత్రను తవ్వారు. పురాణాల్లో దేవతలు కూడా మధుపానం తాగారని.. పేదలు రోజంతా కష్టపడి మహిళలు కూడా కల్లు తాగుతరని శ్రీరెడ్డి స్పష్టం చేశారు. కష్టాన్ని మరిచిపోవడానికి మద్యం తాగడం తప్పు కాదని అన్నారు. మహిళలు తాగవద్దని ఆంక్షలు పెట్టవద్దని.. వీడియోలతో కించపరచవద్దని.. కొద్దిగా తాగితే ఆరోగ్యం చెడిపోదని.. మాకు తాగేందుకు ఫ్రీడమ్ ఇవ్వండని శ్రీరెడ్డి నెటిజన్లకు హెచ్చరిక చేశారు.

మద్యం షాపుల వద్ద మహిళలు క్యూలు కడితే ఫొటోలు తీసినా వీడియోలు తీసినా వారిని పట్టుకొని తన్నండని మహిళలకు శ్రీరెడ్డి పిలుపునిచ్చారు. అల్కహాల్ శరీరానికి మంచిదని.. గర్భినులకు విస్కీ, బ్రాందీ తాగిస్తారంటూ శ్రీరెడ్డి వెల్లడించారు.
Tags:    

Similar News