12 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సౌత్ ఇండియా స్టార్ హీరో...!

Update: 2020-07-19 03:30 GMT
'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కన్నడ రాకింగ్ స్టార్ యష్. కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వసూళ్లు అందుకున్న హీరోగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసాడు యశ్. కన్నడ హీరో కూడా పాన్ ఇండియా మూవీస్ కూడా చేయగలరని నిరూపించాడు. ఒక సీరియల్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన యష్ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ శాండిల్ వుడ్ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం 'కన్నడ బాహుబలి' అని పిలవబడుతున్న 'కేజీఎఫ్' సినిమాకి సీక్వెల్ గా 'కేజీఎఫ్' చాప్టర్ 2 సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

కాగా యశ్ తన మొదట సినిమా 'మొగ్గిన మ‌న‌సు' రిలీజై జులై 18కి ప‌న్నెండేళ్ళు పూర్త‌యింది. ఈ సినిమాతోనే య‌శ్ సతీమణి రాధికా పండిట్ కూడా వెండితెరకు ప‌రిచ‌య‌మ‌య్యారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి శ‌శాంక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమయంలో యశ్ - రాధికా పండిట్ మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ఈ క్రమంలో 'రాకీ' 'గోకుల' 'మొద‌ల సాల‌' 'రాజ‌ధాని' 'కిరాత‌క‌' 'డ్రామా' 'గ‌జ‌కేస‌రి' 'గూగ్లీ' 'రాజాహులి' 'మిస్ట‌ర్ అండ్ మిసెస్ రామాచారి' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు యశ్. ఇక 'కేజీఎఫ్' సినిమాతో యశ్ నేషనల్ వైడ్ స్టార్ గా మారిపోయారు.
Tags:    

Similar News