కాబోయే మూడవ భర్తతో నటి సెల్ఫీ
నటిగా పలు చిత్రాల్లో నటించడంతో పాటు బిగ్ బాస్ కార్యక్రమంతో తమిళ ప్రేక్షకులకు దగ్గర అయిన వనిత విజయ కుమార్ ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకుంది. కొన్ని కారణాల వల్ల ఆ ఇద్దరితో కూడా విడాకులు తీసుకున్న వనిత విజయ్ కుమార్ నేడు మూడవ పెళ్లి చేసుకుంటుంది. నెల రోజుల క్రితమే ఈ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. పీటర్ పాల్ అనే వ్యక్తిని వనిత వివాహమాడబోతుంది.
పెళ్లికి ముందే వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. గత ఏడాది కాలంగా వీరిద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఇద్దరు కూడా పలు విషయాలను షేర్ చేసుకుంటూ సహ జీవనం సాగిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు నిజమేనేమో అన్నట్లుగా గతంలో కొన్ని ఫొటోలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు కారులో ప్రయాణిస్తూ తీసుకున్న సెల్ఫీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మీ ఇద్దరి జంట చక్కగా ఉంది. కాని ఈసారి అయినా ఇతడితో జీవితాంతం కలిసి ఉంటావా అంటూ నెటిజన్స్ వనితను ప్రశ్నిస్తున్నారు. ఒక్కరితో విడిపోతే అవతలి వారి తప్పు అయ్యి ఉంటుంది. ఇద్దరితో విడిపోయావు అంటే తప్పు నీలో లేదు అని చెప్పలేం. కనుక మూడవ పెళ్లి అయినా సంతోషంగా ఉండాలి అంటూ ఆకాంక్షిస్తున్నాం అంటూ కొందరు నేడు జరగబోతున్న ఆమె పెళ్లికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.