లైంగిక వేధింపుల కేసులో బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్!

వ‌రుస‌గా సెల‌బ్రిటీలు వార్త‌ల్లో నిలుస్తున్నారు. వివిధ కార‌ణాల వ‌ల్ల ప‌లు ఇండ‌స్ట్రీల‌కు చెందిన సెల‌బ్రిటీలు వివాదాల్లో చిక్కుకుంటూ నెట్టింట వైర‌ల్ అవుతున్నారు.;

Update: 2026-03-02 10:23 GMT

వ‌రుస‌గా సెల‌బ్రిటీలు వార్త‌ల్లో నిలుస్తున్నారు. వివిధ కార‌ణాల వ‌ల్ల ప‌లు ఇండ‌స్ట్రీల‌కు చెందిన సెల‌బ్రిటీలు వివాదాల్లో చిక్కుకుంటూ నెట్టింట వైర‌ల్ అవుతున్నారు. తాజాగా మ‌లయాళ ద‌ర్శ‌కుడు చిదంబ‌రం వివాదంలో చిక్కుకున్నారు. శౌబిన్ షాహిర్‌, బాబు షాహిర్, షౌన్ ఆంటోనీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `మంజుమ్మ‌ల్ బాయ్స్‌`. 2024లో విడుద‌లైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ అన్ని భాష‌ల్లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుని వార్త‌ల్లో నిలిచింది. ఓ య‌దార్ధ సంఘ‌ట‌న ఆధారంగా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రికార్డులు సృష్టించింది.

కేవ‌లం త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా యునానిమ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని విధంగా రూ.240 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ పండితుల్నే విస్మ‌యానికి గురి చేసింది. ఇంత‌టి బ్లాక్ బస్ట‌ర్ హిట్‌ని అందించిన ద‌ర్శ‌కుడు చిరంబ‌రం తాజాగా ఓ వివాదంలో చిక్కుకోవ‌డం మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేర‌ళ‌లోని ఎర్నాకుళం పోలీస్టేష‌న్‌లో ద‌ర్శ‌కుడు చిదంబ‌రంపై లైంగిక వేధింపుల కేసు న‌మోదు కావ‌డం క‌ల‌క‌ల‌కం రేపుతోంది.

రియ‌ల్ స్టోరీ ఆధారంగా రూపొందించిన సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు చిదంబ‌రం ఇలా లైంగిక వేధిపుల కేసులో ఇరుక్కోవ‌డం ప‌లువురు మ‌ల‌యాళ సినీ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం...ఓ మ‌హిళ ద‌ర్శ‌కుడు చిదంబ‌రంపై లైంగిక ఆరోప‌ణ‌లు చేశారు. 2022లో ద‌ర్శ‌కుడు త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ఎర్నాకుళం పోలీస్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు.

ఈ నేప‌థ్యంలోనే ద‌ర్శ‌కుడు చిదంబ‌రం విచార‌ణ‌కు హీజ‌రు కావాల‌ని నోటీసులు జారీ చేశారు. దీనిపై ద‌ర్శ‌కుడు చిదంబ‌రం స్పందించాల్సి వుంది. 2021లో బాసిల్ జోసెఫ్‌, లాల్‌, అర్జున్ అశోక‌న్‌, బాలు వ‌ర్గీస్‌, గ‌ణ‌ప‌తి ఎస్. పోడువాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `జాన్ ఏ మ్యాన్‌` సినిమాతో చిదంబ‌రం ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. `మంజుమ్మ‌ల్ బాయ్‌` ఆయ‌న‌కు ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. ప్ర‌స్తుతం `బాల‌న్‌`తో పాటు మ‌రో రెండు సినిమాల‌ని రూపొందిస్తున్నారు. ఇందులో `ఒరు దురోహ స‌హ‌చ‌ర్యాతిల్‌` మూవీతో న‌టుడిగా అరంగేట్రం చేస్తున్నాడు.

Tags:    

Similar News