సర్కార్​ ఇవ్వకపోతేనేం.. సోనూకు సామాన్యుడి 'పద్మ సేవా పురస్కారం'

Update: 2020-12-17 05:05 GMT
మనదేశంలో సేవ అన్న పదానికి బాలీవుడ్​ నటుడు సోనూసుద్​ బ్రాండ్​ అంబాసిడర్​గా నిలిచాడు. సేవ అన్నపదానికి పేటెంట్​ హక్కులన్నీ పొందాడు. దేశంలో ఏ మూలన ఎవరికి ఏ  ఆపద వచ్చినా ఆదుకోవడంలో  సోనూ  సుద్​ ముందుంటాడు. సమాజంలో సేవ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ వాళ్లు ప్రతి విషయాన్ని లెక్కగట్టుకుంటారు. మనం సేవచేయబోయే వ్యక్తి మనప్రాంతం వాడేనా.. మన కులంవాడేనా, మనకు ఏమైనా ఉపయోగపడతాడా? లేదంటే కనీసం మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయా? ఇలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకొని సేవలు చేస్తుంటారు.

 కానీ సోనూ  వీళ్లందరికీ భిన్నం.. అతడు సేవ చేయాలని అని ఫిక్స్​ అయితే క్యాలుక్యులేషన్స్​ ఉండవు.. ఈక్వేషన్స్​ ఉండవు. దేశంలోని ఏ మారుమూలన ఉన్న వ్యక్తి అయినా సరే ఇబ్బంది పడుతున్నాడు అని తెలిస్తే .. అతడికి సాయపడతాడు. అది సోనూ  సుద్​. అందుకే ఈ నటుడికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్​మీడియాలో సోనూ ఓ హీరో.  ఏ రాజకీయనాయకుడికి, సేవాసంస్థకు లేని పేరు ఆయనకు సొంతమైంది. అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అతడికి అవార్డులు, రివార్డులు ఇవ్వలేదు. అటువంటివి  సోనూ ఆశించడు కూడా అది వేరే విషయం.

అవార్డులు రాకపోయినప్పటికీ సోనూకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి దక్కింది. యూకేకు చెందిన ఈస్టర్న్‌ ఐ పత్రిక ‘టాప్‌ 50 సౌత్‌ ఏషియన్‌ సెలబ్రిటీస్‌ ఇన్‌ ద వరల్డ్‌’ లిస్ట్‌లో ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచాడు. అయితే ఇప్పుడో సాధారణ కార్పెంటర్‌ సోనూ అవార్డు ఇచ్చాడు. అ అవార్డును సోనూ ఎంతో వినమ్రంగా స్వీకరించాడు. ముంబై నగరానికి చెందిన ఇంద్రోజిర రమేశ్​ ఓ కార్మికుడు. బాల్యమంతా కష్టనష్టాలతోనే నెట్టుకొచ్చాడు.  ప్రస్తుతం కార్పెంటర్ ​గా పని చేస్తున్నాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సాయం చేయాలనిపిస్తుంది. కానీ అతడి ఆర్థిక పరిస్థితి సహకరించదు. అయితే రమేశ్​ ఓ నిర్ణయం తీసుకున్నాడు. తాను సాయం చేయలేడు కాబట్టి.. సాయం చేసే వారిని సత్కరించాలనుకున్నాడు.

దీంతో ప్రజలకు సాయం చేసే వాళ్లను గుర్తించి  వారిని  'పద్మ సేవా’ అనే అవార్డుతో సత్కరిస్తుంటాడు. రమేశ్​ అద్భుతమైన ఫొటో ఫ్రేమ్‌లు కూడా తయారు చేస్తాడు. సమాజ సేవ చేసేవారిని గుర్తించి వారికి ఓ ప్రతిమని తయారు చేసి వారివద్దకే వెళ్లి చిరు సత్కారంతో అందిస్తాడు. గతంలో ‘నేను సైతం’ అంటూ అండగా నిలిచిన లక్ష్మీ మంచు, 220 సార్లు రక్తదానం చేసిన సంపత్‌ కుమార్, భిక్షాటన తో సంపాదించిన రూ.3 లక్షలను సమాజానికే ఖర్చు చేసిన కామరాజు లాంటి వారిని సత్కరించాడు. తాజాగా సోనూ సుద్​ ను సత్కరించాడు.
Tags:    

Similar News