'ఇప్పుడు బెడ్ మీదకు రా'.. సోనమ్ షాకింగ్ కామెంట్..!

Update: 2021-05-27 23:30 GMT
ప్రముఖ బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ సినిమాల కంటే తన ప్రవర్తనతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. బోల్డ్ స్టేట్‌ మెంట్స్‌ తో.. తన భావాలను తనదైన శైలిలో నిర్మొహమాటంగా నిర్భయంగా వ్యక్తం చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ సమస్యలు కొనితెచ్చుకుంటుందీ బ్యూటీ. హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న సమయంలోనే బిజినెస్ మ్యాన్ ఆనంద్ ఎస్ అహుజాను ప్రేమించి పెళ్లి చేసుకుంది సోనమ్. అయితే లేటెస్టుగా సోషల్ మీడియాలో తన భర్త పెట్టిన పోస్టుకు షాకింగ్ కామెంట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల సోనమ్ కపూర్ - అహుజాల వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది. ఈ సందర్భంగా అహుజా తన భార్యను ఇంప్రెస్ చేసేలా ఇన్స్టాగ్రామ్ లో ఓ రొమాంటిక్‌ పోస్ట్ పెట్టాడు. 'మన బంధానికి ప్రతీ రోజు ఓ స్పెషల్ డే. పెళ్లి రోజున పోస్టు చేయడం మరిచిపోయాను. అందుకే ఇప్పుడు నేను ఫోటోను షేర్ చేస్తున్నాను' అంటూ అహుజా పేర్కొన్నారు. దీనికి గతంలో సోనమ్‌ తో చేతిలో చేయి వేసి నడుస్తున్న ఓ ఫోటోను జత చేశాడు.

అయితే భర్త ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కు సోనమ్ కామెంట్ పెట్టింది. 'లవ్ యూ.. లవ్ యూ.. లవ్ యూ.. ఇప్పుడు బెడ్ మీదకు రా' అంటూ సోనమ్ కామెంట్ చేసింది. అమ్మడు చేసిన ఈ రొమాంటిక్ కామెంట్ కి నెటిజన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం సోనమ్ - అహుజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags:    

Similar News