ఫోటో స్టోరీ: బర్త్ డే ఆమెది.. రచ్చ ఈమెది

Update: 2020-05-01 13:30 GMT
ఈరోజు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియాలో చాలామంది అనుష్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా అనుష్కకు బర్త్ డే విషెస్ తెలిపింది. సోనమ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "హ్యాపీ బర్త్ డే డియర్ అనుష్క. ప్రేమ..సంతోషం ఎప్పుడూ నీ వెన్నంటి ఉండాలి. సినిమాలలో కలుస్తా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటో అనుష్క తీసిన ఓ సెల్ఫీ. సోనమ్.. అనుష్క ఇద్దరూ ఒకరిని ఒకరు హగ్ చేసుకుని మరీ ఫోటో తీసుకున్నారు. అనుష్క ఈ ఫోటోలో ఓ స్ట్రైప్స్ ఉన షర్టు ధరించింది ఫై బటన్ ధరించకుండా వదిలేసింది. ఇక సోనమ్ అయితే స్లీవ్ లెస్.. భారీ వీ-నెక్ ఉండే ఓ ఫ్లోరల్ డిజైన్ గౌన్ ధరించి ఇన్స్టా గ్రామ కార్మిక లోకాన్ని ఓ కుదుపు కుదిపింది. మామూలుగానే నెటిజన్లు ఒక లడ్డూ నే తట్టుకోలేరు. అలాంటింది. రెండు లడ్డూలు కావాలా నాయనా అన్నట్టుగా ఉండడంతో ఎంతో మంది నెటిజన్ల మతి చెడిపోయింది. నిజానికి ఎంతో మంది మందు దొరక్క ఎర్రగడ్డ పోతున్నారని అంటున్నారు. వారిలో కనీసం కొందరైనా ఈ ఫోటోల ప్రభావంతో షాక్ షేక్ అయ్యి వెళ్ళేవారు ఉండే అవకాశం ఎంతైనా ఉంది.

ఈ ఫోటోకు రెస్పాన్స్ అదిరిపోయింది. "బర్త్ డే ఆమెది.. రచ్చ ఈమెది"... "2 ఫైర్స్ ఫైర్ ది ఫైర్" అంటూ కామెంట్లు చేశారు. ఒకరైతే 'సోన్-ఆమ్ కపూర్" అంటూ విపరీతార్థం తీసి మరీ కామెంట్ చేయడం చిలిపితనానికి పరాకాష్ట అని చెప్పకతప్పదు! ఇక ఈ ఫోటోకు ఐదు గంటల్లోనే ఏడు లక్షల లైక్స్ రావడం విశేషం.
Tags:    

Similar News