హిందీలో సోనాక్షి ఓకే బంగారం

Update: 2015-07-31 02:10 GMT
ముకుపుడకల సోయగం సోనాక్షి సిన్హా  క్రేజు యువతరంలో అసాధారణం. బాలీవుడ్‌ ని ఏల్తున్న కుర్రనాయికల్లో సోనాక్షి పేరు టాప్‌ 5లో ప్రముఖంగా వినిపిస్తోంది. వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నాయికగా నటిస్తూ తన స్టార్‌ డమ్‌ ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంది. ఈ అమ్మడు లేటెస్టుగా ఓకే బంగారం (ఓకే కన్మణి) రీమేక్‌ లో కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రంలో నిత్యామీనన్‌ పోషించిన పాత్రలో సోనాక్షి నటిస్తోంది. తనకి పెయిర్‌ గా ఆదిత్యరాయ్‌ కపూర్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సఖి రీమేక్‌ ని తెరకెక్కించిన షాద్‌ అలీ దర్శకత్వం వహిస్తారని సమాచారం.

పెళ్లికి ముందే సహజీవనం అన్న కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్‌ రెండుచోట్లా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు బాలీవుడ్‌ లో అక్కడి నేటివిటీకి తగ్గట్టే మార్పు చేర్పులతో తెరకెక్కనుంది. తెలుగువెర్షన్‌ లో ప్రకాష్‌ రాజ్‌, లీసా సామ్సన్‌ నటించిన పాత్రల్లో ఎవరు నటిస్తారో చూడాల్సిందే. నిత్యా పాత్రలో సోనాక్షి వంద శాతం యాప్ట్‌ అవుతుందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్‌ వరకూ వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News