సోయగాలతో సోనాక్షి మెరుపులు

Update: 2017-01-21 10:08 GMT
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాలో.. ఇప్పుడు తళతళలు బాగా పెరిగిపోతున్నాయి. అప్పట్లో బొద్దుగా ఉన్నా.. ఇప్పుడు బాగా చిక్కిన ఈ సుందరాంగి.. తన సోయగాలను లిమిటెడ్ వెర్షన్ లో ఎగ్జిబిట్ చేయడానికి ఆలోచించడం లేదు.

రీసెంట్ గా లాక్మే ఫ్యాషన్ వీక్ కోసం అమ్మడి ప్రిపరేషన్ నుంచి.. ర్యాంప్ వాక్ లో ఒలికించిన సోకులు చూసి.. ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. గోల్డెన్ ఆరెంజ్ టాప్.. స్లీవ్ లెస్ డ్రెస్.. వన్ సైడ్ స్ట్రాప్ తో తెగ ఊరించేసింది సోనాక్షి. ఈ భామ.. బొద్దుగా ఉన్నా తన కాలి సోకులు ప్రదర్శించడానికి కూడా వెనకాడలేదంటే.. గ్లామర్ యాంగిల్ లో అమ్మడు ఏ రేంజ్ లో టార్గెట్ చేసిందో అర్ధమవుతుంది. ఇక మ్యాచింగ్ హైహీల్స్ నుంచి.. చిన్నపాటు ఆర్నమెంట్ కూడా లేకుండా ప్లెయిన్ ఫేస్ తో మైండ్ బ్లాంక్ చేసేసింది సోనాక్షి సిన్హా.

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది ఈమెకు అంతగా కలిసి రాలేదని చెప్పాలి. అకీరా.. ఫోర్స్2 లు అంతగా ఆడకపోవడం ఈ భామకు నిరుత్సాహం కలిగించే విషయం. ఈ ఏడాది ఏప్రిల్ లో రానున్న నూర్ చిత్రంలో కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్ చేస్తోంది సోనాక్షి. మరి ఈ మూవీ అయినా అభిమానులను అలరిస్తే.. మూవీ సైడ్ కూడా అమ్మడి కెరీర్ జోరుందుకుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News