అన్నట్లుగానే సోహెల్‌ ఇచ్చేశాడు

Update: 2021-01-12 10:30 GMT
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 లో సోహెల్‌ చాలా ప్రత్యేకంగా నిలిచాడు. అభిజిత్ విన్నర్‌ గా నిలిచినా కూడా సోహెల్‌ కు మంచి పేరు మరియు డబ్బు వచ్చాయి. నెం.3 గా నిలిచిన సోహెల్‌ కు పాతిక లక్షల నగదు మరియు నాగార్జున నుండి 10 లక్షల రూపాయలు వచ్చాయి. తనకు వచ్చిన దాంట్లోంచి రూ.10 లక్షలను అనాధ ఆశ్రమానికి ఇస్తానంటూ ఫినాలే ఎపిసోడ్‌ సందర్బంగా చెప్పాడు. అన్నట్లుగానే తాను ముందుకు వచ్చి అనాధ ఆశ్రమానికి డొనేషన్‌ చేశాడు. మొత్తం అయిదు అనాధ ఆశ్రమాలను ఎంపిక చేసుకుని వాటికి రూ.2 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది.

ఈ సందర్బంగా సోహెల్‌ మాట్లాడుతూ ఇకపై కూడా తాను సంపాదించిన ప్రతి పైసా లో కూడా 10 నుండి 15 శాతం వరకు విరాళం ఇస్తానంటూ ప్రకటించాడు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాను అని సోహెల్‌ అన్నాడు. తనకు ఎంత డబ్బు వచ్చినా కూడా దాంట్లోంచి కొంత మొత్తంను అనాధ ఆశ్రమానికి ఇవ్వాలనే అనుకున్నాను. ముందు ముందు కూడా తప్పకుండా నేను నా వంతు సాయంను చేస్తూ వస్తాను అన్నాడు. సోహెల్‌ అన్నట్లుగానే పది లక్షలను విరాళంగా ఇవ్వడంను నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఇంతకు ప్రైజ్‌ మనీ కాకుండా రూ.10 లక్షలు నాగార్జున ఇస్తానంటూ ప్రకటించాడు. మరి అది ఇచ్చాడా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.
Tags:    

Similar News