'వి' రిజల్ట్‌ తో జగదీష్‌ లో స్వల్ప మార్పులు

Update: 2020-09-14 07:00 GMT
నాని 25వ సినిమా 'వి' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పర్చడంతో నాని ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. తన నుండి ప్రేక్షకులు ప్రయోగాన్ని ఆశించడం లేదు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఆశిస్తూ ఉన్నారని నానికి క్లారిటీ వచ్చేసింది. అందుకే ప్రస్తుతం తన 26వ సినిమా 'టక్‌ జగదీష్‌' సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్ విషయంలో స్వల్పంగా మార్పులు చేర్పులు చేయించాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో పునః ప్రారంభం కాబోతున్న టక్‌ జగదీష్‌ కు సంబంధించిన కొన్ని సీన్స్‌ లో కామెడీని జోడించాలని నాని కోరుతున్నాడట.

నిన్ను కోరి సినిమాలో తరహా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను నాని మరోసారి టక్‌ జగదీష్‌ చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ అంచనాలున్న టక్‌ జగదీష్ సినిమా రూపొందుతుంది. దర్శకుడు శివ నిర్వాన గత ఏడాది మజిలీ సినిమాతో సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. కనుక మరోసారి ఈ సినిమాతో ఆయన సక్సెస్‌ అవుతాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే 'వి' ఫలితం నేపథ్యంలో జగదీష్‌ మూవీలో మార్పులు చేర్పులు చేయాలని నాని కోరడంతో కొన్ని ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సీన్స్‌ ను ప్రత్యేకంగా జోడించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో రాబోతున్న టక్‌ జగదీష్‌ మళ్లీ ఫామ్‌ లోకి వస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News