అర డజను చిత్రాల్లో ఏది విజేతగా నిలుస్తుందో..?
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జులై 30 నుంచి థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ అయినవన్నీ చిన్న సినిమాలే. జనాలు థియేటర్లకు వస్తారో లేదో అనే సందేహం పక్కన పెట్టి.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకాదరణ దక్కుతుందనే నమ్మకంతో ప్రతీ వారం అర డజను సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇందులో వారానికో సినిమా మంచి వసూళ్లను రాబడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఈ వీక్ లో మరో ఆరు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి.
రేపు (ఆగస్టు 19) గురువారం 3 సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఎల్లుండి శుక్రవారం మరో 3 చిత్రాలు విడుదల అవ్వబోతున్నాయి. రేపు థియేటర్లలోకి వచ్చే సినిమాలలో కాస్త బజ్ ఉన్న సినిమా 'రాజ రాజ చోర' అనే చెప్పాలి. శ్రీవిష్ణు - మేఘా ఆకాష్ - సునయన హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్, నవ్వులతో ప్రేక్షకులకు కాస్త రిలీప్ ఇస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.
ఈ గురువారం వచ్చే మరో సినిమా 'క్రేజీ అంకుల్స్'. శ్రీముఖి - మనో - రాజా రవీంద్ర - భరణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అలానే సునీల్ కీలక పాత్రలో నటించిన 'కనబడుటలేదు' సినిమా కూడా రేపే థియేటర్లలోకి వస్తోంది. ఇక ఆగస్టు 20 శుక్రవారం రోజున 'బజార్ రౌడీ' 'అవలంబిక' 'చేరువైనా దూరమైనా' వంటి మరో మూడు చిన్న సినిమాలు విడుదల కానున్నాయి.
ఇందులో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన 'బజార్ రౌడి' జనాలకు కాస్తో కూస్తో తెలిసిన సినిమా. అయితే సంపూ ఈ చిత్రంలో కామెడీ హీరోగా కాకుండా.. రెగ్యులర్ కమర్షియల్ హీరోగా ట్రై చేస్తున్నాడు. శుక్రవారం రిలీజ్ అయ్యే మిగతా రెండు సినిమాల గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఈ వారంలో వస్తున్న అర డజన్ చిత్రాల్లో ఏది సక్సెస్ అందుకుంటుందో చూడాలి.