ఫోటో స్టోరి: సీతతో సితార పాప..
ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది ఆలియా. క్రేజీ పాన్ ఇండియా మూవీలో చరణ్ (అల్లూరి) సరసన నాయికగా నటిస్తోంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన సీత లుక్ కి ప్రశంసలు కురిశాయి. ఇక ఆర్.ఆర్.ఆర్ టీమ్ తో పాటు ఆలియా మహేష్ - నమ్రత ఫ్యామిలీతోనూ సత్సంబంధాలను కలిగి ఉన్నారు.
ఇటీవల నమ్రత మహేష్ తమ ఇంట్లో ఇచ్చిన ఆతిథ్యానికి ఆలియా అటెండయ్యారు. అలాగే సీతా పాపకు అరుదైన కానుకను కూడా ఇచ్చారు. ఆ కానుకను అందుకుని సితార ఘట్టమనేని ఎంతో మురిసిపోవడమే గాక ఇన్ స్టాలోనూ షేర్ చేయగా అది వైరల్ అయ్యింది.
15 మార్చి అంటే ఈరోజు తన ఫేవరెట్ ఆలియా భట్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలిపేందుకు సీతా పాప స్వయంగా తననే కలిసింది. తనకు ఓ అద్భుతమైన గిఫ్ట్ ని కూడా ఇచ్చింది. ఫేవరెట్ కథానాయిక ఆలియాతో ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ లవ్ లీ పిక్ అభిమానుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఘట్టమనేని అభిమానుల్లో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఆర్.ఆర్.ఆర్ తో పాటు ఆలియా గంగూభాయి కతియావాడీ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ప్రియుడు రణబీర్ తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర రిలీజ్ కి రానుంది.