విష్ణుప్రియకు ఇప్పుడు నెలకు రూ.23 లక్షలా?

డిజిటల్ మీడియా కాలంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో అంచనా వేయడం కష్టం.;

Update: 2026-04-17 03:36 GMT

డిజిటల్ మీడియా కాలంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో అంచనా వేయడం కష్టం. కొన్ని సందర్భాల్లో విమర్శలే వ్యక్తిగత ప్రచారానికి హెల్ప్ చేస్తుంటాయి. ప్రస్తుతం బుల్లితెర నటి, బిగ్‌ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని విషయంలో ఇదే చర్చ నడుస్తోంది. ఆమెపై నమోదైన కేసు ఒకవైపు వివాదానికి దారి తీస్తే, మరోవైపు ఆర్థికంగా మాత్రం లాభాలను తెచ్చిపెట్టిందన్న ప్రచారం హాట్ టాపిక్‌ గా మారింది.

విష్ణుప్రియ తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో ప్రత్యేక కంటెంట్ కోసం సబ్‌ స్క్రిప్షన్ విధానం అమలు చేస్తున్నారు. ఒక్కో యూజర్ నుంచి రూ.399 వసూలు చేస్తోంది. అయితే, విజయవాడలో AISF నాయకులు అశ్లీల కంటెంట్ ప్రోత్సహిస్తున్నారంటూ ఫిర్యాదు చేయకముందు వరకు ఆమె సబ్‌ స్క్రైబర్ల సంఖ్య పరిమితంగా ఉందని సమాచారం. కేసు నమోదు ముందు సుమారు 1,892 మంది మాత్రమే సబ్‌స్క్రైబర్లు ఉండగా, ఈ లెక్కన ఆమెకు నెలకు సుమారు రూ.7.5 లక్షల ఆదాయం వచ్చినట్లు అంచనా.

కేసు నమోదు తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. మీడియా, సోషల్ మీడియాలో ఆ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీయడంతో ఆసక్తి పెరిగింది. దీంతో ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరిగి 6 వేల మార్క్‌ ను దాటినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె ఆదాయం నెలకు రూ.23 లక్షలకు పైగా చేరిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, సబ్‌స్క్రిప్షన్ వ్యవస్థపై ఓ ఇన్‌ ఫ్లుయెన్సర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

చాలా మందికి అసలు సబ్‌ స్క్రిప్షన్ ఆదాయం ఎలా వస్తుందో పూర్తిగా తెలియదని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణగా, 1000 మంది రూ.100 చొప్పున చెల్లిస్తే లక్ష రూపాయలు రావాల్సి ఉంటుందని, కానీ వాస్తవంగా అంత మొత్తం క్రియేటర్‌ కు చేరదని వివరించారు. ఆయన చెప్పిన ప్రకారం, మొబైల్ యాప్‌ ల ద్వారా జరిగే చెల్లింపుల్లో ప్లాట్‌ఫారమ్ కమిషన్లు ఎక్కువగా ఉంటాయి.

ముఖ్యంగా యూజర్ల ద్వారా జరిగే లావాదేవీలలో యాపిల్, ఇన్‌స్టాగ్రామ్ వేర్వేరు శాతాల్లో కమిషన్ తీసుకుంటాయి. దీంతో చివరికి క్రియేటర్ చేతికి సుమారు 55 శాతం చేరుతుందని తెలిపారు. ఈ లెక్కన రూ.23 లక్షల గ్రాస్ ఆదాయం ఉంటే, వాస్తవంగా చేతికి వచ్చే మొత్తం దాదాపు రూ.13 లక్షల వరకు ఉండొచ్చని చెప్పారు. అంతేకాదు, ఆ మొత్తంలో నుంచి టాక్సులు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

కాబట్టి బయటకు కనిపించే మొత్తం ఆదాయం అంతా లాభం కాదని స్పష్టం చేశారు. అయితే ఆ విషయాన్ని తాను సమర్థించడం కాదని, కేవలం లెక్కలు చెప్పడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. మార్కెటింగ్ కోణంలో చూస్తే ఒక ఉదాహరణగా నిలుస్తుందని, వివాదం కారణంగా వచ్చిన అటెన్షన్, సోషల్ మీడియాలో వైరల్ అయిన కంటెంట్ వల్లే సబ్‌స్క్రైబర్ సంఖ్య పెరిగిందని అంటున్నారు. అటెన్షన్ అంటే డబ్బే అన్నది మరోసారి రుజువైందని చెబుతున్నారు.

Tags:    

Similar News