పుష్ప సెంటిమెంట్‌తో రాకా గేమ్ ప్లాన్!

ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన హైలైట్ టెక్నికల్ స్కేల్. అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పనిచేస్తుండటంతో, ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తీసుకెళ్లే ప్రయత్నంగా రాకాను చూస్తున్నారు.;

Update: 2026-04-17 02:30 GMT

పుష్ప ఫ్రాంచైజ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా తన రేంజ్‌ను మరింత పెంచుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు అదే హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న ప్రాజెక్ట్ రాకా. పుష్ప‌2 త‌ర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు సహజంగానే ఆకాశాన్నంటుతున్నాయి. అయితే మొదట ప్రకటించిన 2027 రిలీజ్ డేట్ ఇప్పుడు అనుమానంలో పడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివ‌ర‌కు షూటింగ్ కేవలం 40 శాతం మాత్రమే పూర్తయిందని, మిగిలిన 60 శాతం షూటింగ్ కు మరింత సమయం పట్టే అవకాశముందని సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన హైలైట్ టెక్నికల్ స్కేల్. అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పనిచేస్తుండటంతో, ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తీసుకెళ్లే ప్రయత్నంగా రాకాను చూస్తున్నారు. అయితే ఈ కార‌ణంగానే ఇప్పుడు డిలేకు కారణమవుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారీ విజన్‌తో ముందుకెళ్తున్న అట్లీ కుమార్ ఎగ్జిక్యూషన్ దశలో స్లో అయ్యాడా అనే చర్చ కూడా జరుగుతోంది. విజువల్ గ్రాండియర్ కోసం తీసుకుంటున్న టైమ్, ఫైనల్ అవుట్‌పుట్‌ను ఎలివేట్ చేస్తుందా? లేక రిలీజ్ టైమ్‌లైన్‌ను మరింత వెనక్కి నెడుతుందా? అన్నది కీలకంగా మారింది.

రిలీజ్ ప్లానింగ్ విషయంలో కూడా ఆసక్తికరమైన స్ట్రాటజీ కనిపిస్తోంది. పుష్ప సిరీస్‌కు కలిసొచ్చిన డిసెంబర్ సెంటిమెంట్‌ను రాకాకు కూడా అప్లై చేయాలనే ఆలోచనలో బన్నీ ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంటే 2027 డిసెంబర్ టార్గెట్‌గా ఫిక్స్ చేయడం వెనుక ఇదే లాజిక్. అయితే అప్పటికి సినిమా రెడీ కాకపోతే, సంక్రాంతి లేదా 2028 సమ్మర్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే, పాన్ ఇండియా స్థాయిలో ఉన్న ప్రెజర్ కూడా చిన్నది కాదు. బాలీవుడ్ నుంచి సౌత్ వరకు అన్ని మార్కెట్లలో రాకాపై భారీ అంచనాలున్నాయి. ఒకేసారి మల్టిపుల్ మార్కెట్లను శాటిస్‌ఫై చేయాల్సిన‌ పరిస్థితి, ప్రొడక్షన్ మీద అదనపు ఒత్తిడిని పెంచుతోంది. మ‌రి ఈ పరిస్థితుల్లో, రాకా రిలీజ్ ఎప్పుడ‌న్నది పూర్తిగా వీఎఫ్ఎక్స్ అవుట్‌పుట్, మిగిలిన షూటింగ్ స్పీడ్ మీదే ఆధారపడి ఉంది.

Tags:    

Similar News