అంతకంతకూ హీటెక్కిస్తున్న మానుషి!
ప్రపంచ సుందరిగా కిరీటాన్ని కైవసం చేసుకున్న మానుషి చిల్లర్ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో మాత్రం వెనుకబడిందనే చెప్పాలి.;
ప్రపంచ సుందరిగా కిరీటాన్ని కైవసం చేసుకున్న మానుషి చిల్లర్ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో మాత్రం వెనుకబడిందనే చెప్పాలి. ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా వంటి మాజీ విశ్వసుందరిలు వెండితెరపై మకుటం లేని మహారాణులుగా వెలుగొందగా..మానుషికి మాత్రం ఆ స్థాయి లక్ కలిసిరావడం లేదు. అందాల పోటీల వేదికపై భారత కీర్తిని చాటిన ఈ భామ.. నటిగా తనకంటూ ఒక బలమైన ముద్ర వేయడానికి ఇంకా పోరాడుతూనే ఉంది.
సినిమా కెరీర్ ఆరంభం నుండి మానుషికి ఆశించిన విజయాలు దక్కలేదు. తెలుగులో భారీ అంచనాల మధ్య విడుదలైన `ఆపరేషన్ వాలెంటైన్` బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇక హిందీలో చేసిన చిత్రాలు కూడా తన కెరీర్‌కు ఊపునివ్వలేకపోయాయి. 2025లో ఒకటి రెండు సినిమాల్లో మెరిసినా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తన చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏవీ లేకపోవడం గమనార్హం. నటిగా నిలదొక్కుకోవడానికి మానుషి చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలితాలను ఇవ్వడం లేదు. 2024లో బడే మియాన్ చోటే మియాన్, 2025లో ఆపరేషన్ వేలెంటైన్ లాంటి చిత్రాలపై మానుషి చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ అవన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో నిజంగా మరోసారి అన్ లక్కీ గాళ్ అని ప్రూవైంది.
నటన పరంగా వెనుకబడిపోయినా తనకున్న `మిస్ వరల్డ్` హోదాను మానుషి చక్కగా ఉపయోగించుకుంటోంది. వరుసగా ప్రముఖ కంపెనీల వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ బ్రాండ్ ప్రమోషన్లను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిరంతరం షేర్ చేస్తూ అభిమానులకు చేరువలో ఉంటోంది. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా యాడ్స్, ఈవెంట్స్ ద్వారా తన పాపులారిటీని కాపాడుకుంటూ ఆర్థికంగా నిలకడగా కొనసాగుతోంది.
అయితే ఇటీవల మానుషి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోగ్రాఫ్స్ నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. గతంలో ట్రెడిషనల్ లుక్స్‌తో పద్ధతిగా కనిపించిన ఈ సుందరి.. ఇప్పుడు తన పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మానుషి షేర్ చేసిన స్కై బ్లూ బికినీ ఫోటోషూట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. గ్లామర్ డోస్ పెంచి మునుపటి కంటే బోల్డ్‌గా కనిపిస్తూ కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ మార్పు వెనుక తన నటన చాతుర్యంతో పాటు గ్లామర్ యాంగిల్ కూడా ఉందని మేకర్స్‌కు గుర్తు చేసే ప్రయత్నం ఉందా అనే చర్చ మొదలైంది.
సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు... సరైన సమయంలో సరైన సక్సెస్ కూడా తోడవ్వాలి. మానుషి ఇప్పుడు గ్లామర్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ తన కెరీర్‌ను మళ్ళీ ట్రాక్‌లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ రేంజ్ అందాల ప్రదర్శన తనకు మునుముందు రోజుల్లో కొత్త సినిమా ఆఫర్లను తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి. ఏదేమైనా.. మానుషి లేటెస్ట్ ఫోటోలు మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ - బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.