తల్లిదండ్రుల కర్మకాండలు.. అయ్యో! తిరువీర్ అన్ని మాటలు పడ్డారా?

విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తాజాగా తన జీవితంలోని ఒక విషాదకర సంఘటన బయటపెట్టి అందరినీ కదిలించారు.;

Update: 2026-04-17 03:32 GMT

విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తాజాగా తన జీవితంలోని ఒక విషాదకర సంఘటన బయటపెట్టి అందరినీ కదిలించారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్ విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాలను వెల్లడించారు.

సినిమా ఇండస్ట్రీలో కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు దాగి ఉంటాయని తిరువీర్ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకర సంఘటనలు పంచుకున్నారు. ప్రొఫెషన్ పట్ల కాన్సట్రెంటేషన్ కారణంగా తల్లిదండ్రుల చివరి క్షణాల్లో కూడా వారి వద్ద ఉండలేకపోయానని, అది తన జీవితంలో ఎప్పటికీ మిగిలిపోయే గాయమని అన్నారు.

తన కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో స్టేజ్ డ్రామాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌ గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్న ఆయన, ఆ ప్రయాణంలో ప్రశంసలు, అవమానాలు, ఆకలి, ఆనందం.. ఇలా అన్ని అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పారు. అయితే ఓ విషయం సినిమాలకు సంబంధం లేకుండా, పరిస్థితులు వచ్చినందుకే చెబుతున్నానని స్పష్టం చేశారు. తనపై సింపతీ చూపించి సినిమా చూడొద్దని కూడా ప్రేక్షకులను కోరారు.

తిరువీర్ మాట్లాడుతూ, బొమ్మలరామారం షూటింగ్ సమయంలో తన తండ్రి మరణించారని, పలాస చిత్రీకరణ సమయంలో తల్లి చనిపోయారని తెలిపారు. రెండు సినిమాల కంటిన్యుటీ కారణంగా షూటింగ్ మధ్యలో వెళ్లలేకపోయానని చెప్పారు. ఒక్కడే కొడుకుని అయినప్పటికీ తల్లిదండ్రులకు కర్మకాండలు చేయలేకపోయానని, అందుకు బంధువులు తీవ్రంగా విమర్శించారని గుర్తు చేసుకున్నారు.

సినిమాలు చేస్తానంటావ్… ఎక్కడా కనిపించవు అంటూ చుట్టాలు తిట్టారని, ఆ మాటలు ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. తల్లిదండ్రులు ముగ్గురు కూతుళ్ళ తర్వాత పుట్టిన తనపై ఎంతో ఆశలు పెట్టుకున్నారని, కానీ వారి చివరి క్షణాల్లో కూడా తన బాధ్యతలను నిర్వర్తించలేకపోయానన్న గిల్ట్ ఇప్పటికీ తనలో ఉందని భావోద్వేగానికి గురయ్యారు. వ్యక్తిగత విషాదాన్ని పక్కనపెట్టి వృత్తి కోసం చేసిన త్యాగం ఇప్పుడు నెటిజన్లను కదిలిస్తోంది.

ఇదిలా ఉంటే, తిరువీర్ గతంలో నటించిన మసూద, పరేషాన్ వంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్‌ గా పెద్దగా విజయాన్ని సాధించలేదు. అయితే పాపం ప్రతాప్ విషయంలో మాత్రం ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నారు. స్ట్రాంగ్ ప్రొడక్షన్ హౌస్ మద్దతుతో పాటు, సినిమా ప్రమోషన్లు కూడా ఫుల్ జోష్ లో జరిగాయి.

పెళ్లయిన నాలుగు రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోతే ప్రతాప్ అనే యువకుడు ఎదుర్కొనే సమస్యల చుట్టూ కథ సాగుతుంది. 90ల నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో ప్రేమ, హాస్యం, భావోద్వేగాలతో కూడిన కథతో చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కించగా. ఇప్పుడు పాపం ప్రతాప్ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News