కరోనా సోకిందని చచ్చిపోమన్నారని గాయని ఆవేదన
బేబీ డాల్ (సన్నీలియోన్- రాగిణి ఎంఎంఎస్ 2) ఫేం .. ప్రముఖ గాయని కనికా కపూర్ కి కరోనా సోకినా దానిని లెక్క చేయక ఓ ఈవెంట్లో ప్రదర్శన ఇవ్వడం అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలంతా ఆస్పత్రులకు పరుగులు పెట్టి కరోనా సోకిందో లేదో చెక్ చేయించుకోవడంతో కనిక చేసిన పనికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కరోనా సోకడం కంటే ఆ తర్వాత తాను ఎదుర్కొన్న విమర్శల వల్లనే ఎక్కువ బాధపడ్డానని కనిక తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బేబీ డాల్ (రాగిణి ఎంఎంఎస్ 2).. లవ్లీ (హ్యాపీ న్యూ ఇయర్) గాయని కనిక ఈ ఏడాది మార్చిలో COVID19 సోకిన అనంతరం తన అనుభవం గురించి మీడియాతో ముచ్చటిస్తూ సంచలన విషయాల్ని బయటపెట్టారు. “అప్పట్లో కరోనా సోకినా.. నేను ఆసుపత్రికి చేరుకునే సమయానికి నాకు ఆరోగ్యం బాగానే ఉంది. ఆసుపత్రిలో నా పరీక్షలు సానుకూలంగా ఉన్నాయి. బహుశా అప్పటికి నేను లక్షణరహితంగా మారిపోయాను. నాకు తెలియదు. వైద్యులు నాపై చాలా పరీక్షలు నిర్వహించారు. నేను 3 కిలోలు బరువు తగ్గాను. ఆకలి తగ్గి.. జుట్టు రాలింది. రుచి స్వభావం తగ్గి కొంతకాలం వాసనను కోల్పోయాను. నాకు విటమిన్లు ఇచ్చి ట్రీట్ చేశారు. పక్షం రోజుల తరువాత పూర్తిగా నయమైపోయి నేను ఇంట్లో ఉన్నాను. అయితే నేను ఆ దశలో మానసికంగా తీవ్రంగా కలత చెందాను. ప్రజలు నా చుట్టూ ఉంటే భయపడకుండా ఉండేందుకు కొంత సమయం పట్టింది ” అని కనికా చెప్పారు.
ప్రాణాంతక వైరల్ ఇన్ఫెక్షన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాయని కనికా అప్పట్లో సోషల్ మీడియాలో చాలా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆమె కుటుంబం పిల్లలు కూడా ఆమె అనారోగ్యం తీవ్రతను భరించారు. ఆమెను మరింత బాధపెట్టిన విషయం ఏమిటో ప్రశ్నిస్తే... తనపై విద్వేషంతో చనిపోవాలని కొందరు నెటిజనులు కోరారని వెల్లడించారు. “నా పెద్ద ఉమ్మడి కుటుంబం విషయంలో ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ప్రతిఒక్కరికీ వారి పొరుగువారి నుండి.. వారి ఫ్రెండ్ సర్కిల్స్ నుండి చాలా ద్వేషం పెట్రేగింది. అనారోగ్యంపై ఎవరూ ప్రశ్నించలేదు. ఈ పరిస్థితిలో సముదాయించే వ్యక్తి కూడా లేడు. ఆ దశలో నా కుటుంబం తప్ప మరెవరూ నా కోసం ముందుకు రాలేదు. ఇది చాలా పెద్ద మేలుకొలుపు అభ్యాసం. ప్రజలు నిజం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా వ్యవహరించారు. నన్ను తిట్టారు. చనిపోవాలని కోరారు ” అని తీవ్ర ఆవేదనతో వెల్లడించారు.
కనికా ఇటీవల తన టీనేజ్ పిల్లలతో లండన్ లో కొన్ని నెలలు గడిపారు. తనకు ఇద్దరు కుమార్తెలు. ఆమె ఈ సంవత్సరం జూలైలో కొంతకాలం యునైటెడ్ కింగ్ డమ్ కి వెళ్లి ఇటీవలే ముంబైకి తిరిగి వచ్చారు. తన పిల్లలను తిరిగి UK లో వదిలివేయడం తప్ప ఆమెకు వేరే మార్గం లేదని అనిపించిందట ఒకానొక సమయంలో.
“తన పిల్లలను భారతదేశానికి వెళ్లడానికి అనుమతించలేదు. వారు బ్రిటిష్ పౌరులు. అది కష్టమైనదే. కానీ పని ప్రారంభించడానికి నేను తిరిగి భారతదేశానికి రావలసి వచ్చింది. వారిని ఇక్కడికి తీసుకురావడానికి నేను కుటుంబం నుండి అనుమతి పొందలేదు. ఇటీవల కొన్నేళ్లలో పాఠశాలలో వారి ముఖ్యమైన రోజుల కోసం నేను నిరంతరం లండన్ కు వెళ్లాను. వారికి అవసరమైన ప్రతిదీ అందించాను. నేను COVID19 తో పోరాడినప్పుడు మేము రెండు వేర్వేరు దేశాలలో ఉన్నాము. ఆ సమయంలో ఎంతో కఠినమైన దినాల్ని ఎదుర్కొన్నాం. నేను నిస్సహాయురాలినే అయ్యాను. ఆపై నేను ఏదో ఒకవిధంగా దాన్ని అధిగమించాను. నేను వీడియో కాల్స్ ద్వారా నా పిల్లలను పెంచుతున్నాను. మైళ్ళ దూరంలో ఉండిపోయినా నేను వారి కోసం ప్రతిదీ చేస్తున్నాను`` అని వెల్లడించారు.