'జ‌న నాయ‌గ‌న్' రిలీజ్ వివాదం ఓ కుట్ర‌?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా విజ‌య్ `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.;

Update: 2026-04-02 11:04 GMT

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత ద‌ళ‌ప‌తి న‌టించిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌`. విజ‌య్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తూ చేసిన చివ‌రి సినిమా ఇది. న‌ట‌కు గ‌డ్ బై చెబుతూ రాజ‌కీయ అంశాల నేప‌థ్యంలో రూపొందిన సినిమా ఇది. జ‌న‌వ‌రి 9న పొంగ‌ల్ రేసులో భాగంగా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. అంతే కాకుండా విజ‌య్ న‌టించిన చివ‌రి సినిమా కావ‌డంతో భారీ స్థాయిలో ఆయ‌న‌కు ఓ ఫేర్‌వెల్ మూవీలా ఉండాల‌ని అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాల‌ని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే అనూహ్యంగా సెన్సార్ వివాదం త‌లెత్త‌డంతో జ‌న‌వ‌రి 9న రిలీజ్ ఆగిపోయింది. అక్క‌డి నుంచి క‌థ అనేక మ‌లుపులు తిరుగుతూ ఫైన‌ల్‌గా త‌మిళ‌నాడు ఎన్నిక‌ల కార‌ణాల చేత ఇప్ప‌టికీ రిలీజ్‌కు నోచుకోవ‌డం లేదు. రిలీజ్ పేరెత్తితే ఎల‌క్ష‌న్ కోడ్ అని కొందరు, రివైజింగ్ క‌మిటీ క్లియ‌రెన్స్ ఇంకా రాలేద‌ని మ‌రి కొంద‌రు, త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత రిలీజ్ అవుతుంద‌ని మ‌రి కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ వివాదంపై హీరో విజ‌య్‌ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌తను సంత‌రించుకుంది.

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా విజ‌య్ `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని నెల‌లుగా ఈ సినిమా రిలీజ్ విష‌యంలో సందిగ్ద‌త నెల‌కొన్ని విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సినిమా రిలీజ్ వివాదంపై కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. సినిమా విడుద‌ల‌ విష‌యంలో కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. త‌న‌కు న్యాయం కావాల‌ని ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేశారు. `క‌రూర్ ఘ‌ట‌న ఒక ఉమ్మ‌డి కుట్ర అని చాలా మంది చెబుతున్నారు. మీకు న్యాయం జ‌ర‌గాల‌ని నేను ఎలా అయితే కోరుతున్నానో నాకు అలాగే న్యాయం జ‌ర‌గాల‌ని కోరుతున్నా అన్నారు.

దీంతో విజ‌య్ `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ వెనుక కుట్ర కోణం దాగి ఉంద‌ని, విజ‌య్‌ని రాజ‌కీయంగా దెబ్బ కొట్టాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే సినిమాని విడుద‌ల కానివ్వ‌డం లేద‌నే చర్చ‌ త‌మిళ‌నాట మొద‌లైంది. గ‌త కొన్ని నెల‌లుగా ఇదే అనుమానాన్ని విజ‌య్ అభిమానులు వ్య‌క్తం చేయ‌డం, అదే విష‌యాన్ని తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో విజ‌య్ స్ప‌ష్టం చేయ‌డం త‌మిళ‌నాట హాట్ టాపిక్‌గా మారింది. విజ‌య్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో త‌మిళ నాడులోని కీల‌క రాజ‌కీయ వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే `జ‌న నాయ‌గ‌న్‌` మూవీని త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత అంటే మేలో కానీ జూన్ ప్రారంభంలో కానీ రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు షికారు చేస్తున్నాయి. అయితే వీటిపై మేక‌ర్స్ ఇంత వ‌ర‌కు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. జూన్‌లో ఇదే నిర్మాణ సంస్థ నిర్మించిన `టాక్సిక్‌` రిలీజ్ కానున్న నేప‌థ్యంలో `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ అయ్యే అవ‌కాశం లేద‌ని, మేలో రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉందని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News