శింబు సింగిల్​ టేక్​.. కుమ్మేశాడంతే..!

Update: 2021-04-26 09:30 GMT
నటన కొంతమందికి చాలా కష్టం. మరికొంత మందికి మాత్రం చాలా సులువు. ఒక్కసారి స్క్రిప్ట్​ చదివారంటే అలా ఆ పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేసేస్తుంటారు. ఎంత భారీ డైలాగు లు అయినా సింగిల్​ టేక్​ లో చెప్పేస్తుంటారు కొందరు నటులు. తెలుగులో ఎన్టీఆర్​, ఎస్వీఆర్​, కృష్ణ ఎంత భారీ డైలాగులనైనా ఒక్కసారి చదువుకొని చెప్పేవారంట. నటనలోనూ ఆ హావభావాలు పలికించేవారట. ఇక పదుల సంఖ్యలో టేకులు తీసుకొనే నటులూ ఉన్నారు.

 ఇదిలా ఉంటే తమిళంలోనూ చాలా మంది సింగిల్​ టేక్​ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో హీరోలు కూడా ఉన్నారు. ప్రముఖ నటుడు శింబు ఆ కోవకే చెందుతారు. ఎంత పెద్ద డైలాగ్​ అయినా అలవోకగా చెప్పడం శింబుకు అలవాటు. ఎందుకంటే శింబుకు నటన మీద, తన పాత్ర మీద అంత కమాండ్​ ఉంటుంది. శింబు స్వయంగా దర్శకుడు, రచయిత కాబట్టి.. అతడికి నటన లో  ఆ రేంజ్​లో గ్రిప్​ ఉంటుంది. ఎంత పెద్ద డైలాగు అయినా చాలా ఈజీగా చెప్పేయడం.. నటలోనూ ఆ హావభావాలు పలికించడం శింబు కు వెన్నతో పెట్టిన విద్య. శింబు తండ్రి రాజేందర్​ కూడా గొప్ప రచయిత, దర్శకుడు సో శింబూ.. నటనలోని మెళకువలను తన తండ్రి వద్దే నేర్చుకున్నాడు.  

తాజాగా శింబూ ఆరు నిమిషాల ఓ సీన్​ను సింగిల్ టేక్​లో పూర్తిచేసి శభాష్​ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన మనాడు అనే చిత్రంలో నటిస్తున్నాడు. వీ హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌ కామాక్షి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నటి కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్​గా నటిస్తోంది.  ప్రస్తుతం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్​ జరుగుతోంది.

శనివారం నటుడు శింబు, కళ్యాణి ప్రియదర్శన్, ఎస్‌ జె సూర్య, ప్రేమ్‌ జీ పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సీన్​ మొత్తం ఆరు నిమిషాలు ఉంటుంది. అయితే దర్శకుడు సన్నివేశాన్ని వివరించిన వెంబడే శింబూ ఒకే టేక్​ లో మొత్తం సీన్​ చేసేశాడు. దీంతో అక్కడున్న యూనిట్​ ఆశ్చర్యపోయింది. గతంలోనూ చాలా సార్లు శింబూ ఒకే టేక్​ లో సన్నివేశాన్ని రక్తికట్టించాడు.  శింబూ సింగిల్​ టేక్​ ఆర్టిస్ట్​ అనే విషయం మరోసారి రుజువైందని ఆయన  ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు.
Tags:    

Similar News