ఫోటో స్టొరీ: రెడ్ టాప్ లో రెడ్ హాట్ అందాలు

Update: 2018-10-09 09:30 GMT
కొంతమంది టాలీవుడ్ టాప్ హీరోలు.. మన ముఖ్యమంత్రులు ముహూర్తం చూసి గానీ ఏ పనులు చెయ్యరట.  మరి వీళ్ళేనా లేదా ఇన్స్టాగ్రామ్ బ్యూటీలు కూడా తమ హాట్ ఫోటోలను ముహూర్తం చూసి అప్లోడ్ చేస్తారా?  ఏమో రాహుకాలం యమగండం లేకుండా చూసి ఫోటో అప్లోడ్ చేస్తే లైకుల తో.. షేర్ల తో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుందేమో!

ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే.. హీరోయిన్ సిద్దికా శర్మ హాట్ పిక్ ఒకటి ఈమధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఆ ఫోటో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లేదు.  మరి మంచి ముహూర్తం చూసి పోస్ట్ చేస్తుందేమో.  సరే ఇలాంటి అర్థం పర్థం లేదని చెత్త డిస్కషన్ పక్కన బెడదాం.  అసలు ఆ రెడ్ కలర్ టాప్ లో సిద్ధిక ఎలా ఉందంటే ఒక అప్సరస హాలిడే వెకేషన్ కోసం భూమిమీదకు వచ్చి ఒక ఫోటో షూట్ చేసి నట్టు. సిద్ధిక అందాలను కారాగారంలో బంధించిన రెడ్ టాప్ ను  నెటిజనులు తిట్టుకున్నా కాస్తా గాలాడేలా కటకటాలను ఉంచి ఉంచినందుకు సంతోషిస్తారు.

ఇంతకీ ఈ సిద్ధిక ఎవరు..? అని మీకు అనుమానం రాలేదా?  కృష్ణవంశీ-నాని కాంబినేషన్ లో తెరకెక్కిన 'పైసా' సినిమాలో హీరోయిన్.  పెద్దగా కెరీర్లో సక్సెస్ సాధించలేదు. కానీ ఇన్స్టాలో హాటు ఫోటోలతో నెటిజనులకు కిక్కివ్వడంలో బహు నేర్పరి.
Tags:    

Similar News